మెగా ఫ్యామిలీలో చీలిక...బాంబు పేల్చిన రామ్ చరణ్!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మెగా ఫ్యామిలీలో చీలికలు ఏర్పడ్డాయని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. పవన్ బాబాయ్ కొత్త పార్టీపై రామ్ చరణ్ స్పందిస్తూ.....ఎవరి దారులు వారికి ఉంటాయి, బాబాయ్‌కి సపోర్టు ఇవ్వను, నా సపోర్టు ఎప్పటికీ నాన్నకే అని రామ్ చరణ్ కుండ బద్దలు కొట్టారు. తనకు రాజకీయాలపై అవగాహన లేదని తేల్చి చెప్పారు.
పవన్ పార్టీ పెడుతున్న నేపథ్యంలో మెగా ఫ్యామిలీ రెండుగా చీలిపోయిందనే చర్చ సాగుతోంది. గత కొంత కాలంగా పవన్ కళ్యాణ్‌తో టచ్‌లో ఉంటున్న నాగబాబు.....ఇకపై పవన్ కళ్యాణ్‌కు అన్ని విధాలా మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు మీడియా టాక్. వీరిద్దరు కలిసి ఒక వర్గంగా ఉంటే....చిరంజీవి, అల్లు అరవింద్, రామ్ చరణ్ మరోవర్గంగా ఉండనున్నారు.

గత కొంత కాలంగా మెగా ఫ్యామిలీలో ముసలం సాగుతోందని మీడియాలో వార్తలు వినిపిస్తున్నా....మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్, నాగ బాబు అలాంటివేమీ లేవు అన్నట్లు వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇటీవల నాగ బాబు తనయుడు వరుణ్ తేజ్ సినిమా ఓపెనింగ్ సందర్భంగా కూడా చిరంజీవి-పవన్ ఎదురు పడ్డా....అసలు మాట్లాడుకోలేదు.
పవన్ కళ్యాణ్ కళ్యాణ్ పార్టీ విషయానికొస్తే....తొలుత సొంతగా టీం తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పలు అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల నుండి పలువురు అభ్యర్థులను పోటీకి నిలుపుతారని, ఆ తర్వాత పార్టీ ప్రకటిస్తారని అంటున్నారు. ఈ పార్టీకి కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్, యువరాజ్యం, పీపుల్స్ ఫర్ రిపబ్లిక్ అనే పేర్లను పరిశీలిస్తున్నారు.


Click it and Unblock the Notifications











