పవన్ కళ్యాణ్ తో షేర్ చేసుకునే వాడ్ని
హైదరాబాద్: మాది కొంచెం డిఫరెంట్ రిలేషన్. కాసేపు ఫ్రెండ్స్‌లా ఉంటాం. ఇంకాసేపు తండ్రీకొడుకుల్లా ఉంటాం. అప్పట్లో నాన్న చాలా బిజీగా ఉండేవారు. అప్పుడు నేను ఏది షేర్ చేసుకోవాలన్నా బాబాయ్‌తోనే. మేమిద్దరం ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళం. డాడీకి ఏది కన్వే చేయాలన్నా బాబాయ్ ద్వారానే చేసేవాణ్ణి అంటూ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ తో ఉన్న రిలేషన్ గురించి రామ్ చరణ్ వివరించారు
తాము తరుచుగా కలుస్తామని చెప్తూ... ఈ నెలలోనే కలుసుకోలేదు 'జంజీర్' గురించి చెబితే చాలా మంచి నిర్ణయం తీసుకున్నావని మెచ్చుకున్నారు అన్నారు. ఇక మెగా కుటుంబం నుంచి వస్తున్న హీరోల గురించి చెప్తూ... సాయిధరమ్ తేజ్, వరుణ్‌తేజ్, అల్లు శిరీష్ బాగా శిక్షణ పొంది వస్తున్నారు. ఎప్పటినుంచో సినిమా ఫీల్డ్‌ని అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారు. ఈ మధ్య 'రేయ్' క్లిప్పింగ్స్ చూశా. సాయిధరమ్ తేజ్ చాలా బాగా చేశాడు. 'ఐ విష్ హిమ్ ఆల్‌ది బెస్ట్ అన్నారు.
అల్లు అరవింద్ ప్రభావం గురించి చెప్తూ... మా ఇంట్లో ఏ పెద్ద నిర్ణయం తీసుకోవాలన్నా, మాలో ఎవరికి ఏ సమస్య వచ్చినా మొదట గుర్తొచ్చే వ్యక్తి ఆయనే. ఎప్పుడైనా మేం ఎమోషనల్‌గా రియాక్ట్ అవుతామేమో కానీ, ఆయన అస్సలు అలా రియాక్ట్ కారు. ఆ సమస్యను ఎలా పరిష్కరించాలన్న ఆలోచనే తప్ప, తన రియాక్షన్ బయటికి కనబడదు. మా ఫ్యామిలీలో అందరికీ ఆయనే పెద్ద అండ. ఓ న్యూట్రల్ మైండ్‌తో ఆలోచిస్తారాయన. చిన్నప్పుడు నాకేది కావాలన్నా మామ ద్వారానే రికమెండేషన్ చేయించుకునేవాణ్ణి అన్నారు.


Click it and Unblock the Notifications











