»   » సుక్కూను గట్టిగా అడిగా, చుక్కలు చూపించాడు, బ్లైండ్‌గా దూకేశా: రామ్ చరణ్ కామెంట్

సుక్కూను గట్టిగా అడిగా, చుక్కలు చూపించాడు, బ్లైండ్‌గా దూకేశా: రామ్ చరణ్ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ram Charan Interview On Rangasthalam

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రంగస్థలం'. ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మీడియా ఇంటర్వ్యూలతో రామ్ చరణ్ బిజీ అయ్యాడు. తాజాగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చరణ్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

టెన్షన్ ఉంది, ఆందోళన లేదు

టెన్షన్ ఉంది, ఆందోళన లేదు

రిలీజ్ డేట్ దగ్గర పడటంతో రిజల్ట్స్ వచ్చే మూడ్ నాకు వచ్చేసింది. బర్త్ డే దగ్గర్లో ఉన్నా ఎగ్జైట్మెంట్ లేదు ఏమీ లేదు. ఒక టెన్షన్ మాత్రమే ఉంది. బర్త్ డే సందర్భంగా ఎవరూ నా దగ్గరకు రాకండి, డైరెక్టుగా 30వ తేదీనే కలుస్తాను అని అందరికీ చెబుతున్నాను. టెన్షన్ ఉంది కానీ ఆందోళన మాత్రం లేదు. ఈ సినిమా కోసం చాలా కష్టపడి పనిచేశాం. నిజంగా చెప్పాలంటే ఇందులో నా వల్ల అయినంత బెస్ట్ ట్రై చేశాను..,. అని రామ్ చరణ్ తెలిపారు.

 లుంగీలంటే చాలా ఇష్టం

లుంగీలంటే చాలా ఇష్టం

సినిమా షూటింగులో ప్రతి రోజూ ఎంజాయ్ చేశాం. షూటింగ్ అప్పుడే అయిపోయిందా? ఇంకొన్ని రోజులు ఉంటే బావుండు అనిపించింది. చిట్టి బాబు క్యారెక్టర్‌తో అంత బాండింగ్ ఉండటానికి కారణం ఆ క్యారెక్టరేజేషన్, ఆ పాత్ర లుంగీలో ఉండటం. నాకు లుంగీలంటే చాలా ఇష్టం. చాలా మందికి తెలియని విషయం నేను ఇంట్లో ఎక్కువగా లుంగీలే ప్రిఫర్ చేస్తాను. ఈ క్యారెక్టర్ అందరికీ కనెక్ట్ అయ్యేలా సుకుమార్ డిజైన్ చేయడం కూడా నచ్చింది అని చరణ్ తెలిపారు.

సుక్కూను గట్టిగా అడిగా

సుక్కూను గట్టిగా అడిగా

నేను ధృవ షూటింగ్ పైనల్ డేస్ లో ఉన్నపుడు సుకుమార్ గారు వచ్చి నన్ను కలిశారు. నేను అప్పుడు ఒకటే అడిగా... ఏం సుక్కు నాతో సినిమా చేయడానికి ఇన్ని రోజులు పట్టింది అని గట్టిగా అడిగాను... దీంతో ఆయన అయ్యో సారీ చరణ్ గారు, కుదరలేదు అని ఏదో చెప్పారు. పాపం ఆయన ఒక్కో సినిమా వన్ అండ్ ఆఫ్ ఇయర్ అలా తీస్తా ఉంటారు. ఆ సమయానికి నేనూ ఖాళీగా లేను, ఆయన కూడా లేరు.... అని రామ్ చరణ్ తెలిపారు.

మొదటి మాట నీకు చెవుడు అన్నాడు

మొదటి మాట నీకు చెవుడు అన్నాడు

నాతో ఎలాంటి సినిమా చేయబోతున్నారు అనగానే.... పల్లెటూరి బ్యాక్ డ్రాపుతో సినిమా చేద్దామనుకుంటున్నాను అన్నారు. నేను ఎన్నో సంవత్సరాలు ఉన్న విలేజెస్ ప్రాంతానికి సంబంధించి ఒక మంచి పొలిటికల్ డ్రామా, చేస్తావా? అంటే... స్టోరీ వినకుండానే చేస్తాను అని చెప్పాను. నెక్ట్స్ డే ఈవినింగ్ వచ్చి కథ చెప్పారు. ఫస్ట్ మాట నీకు చెవుడు అన్నాడు. క్యారెక్టరైజేషన్ ఒకే చెబితేనే నేను కథ చెబుతాను, లేక పోతే చెప్పను అన్నాడు. అదేంటి సుకుమార్ అంటే నువ్వు నన్ను నమ్ము 2 గంటల తర్వాత వేరే పాయింట్ ఆఫ్ వ్యూతో కథ నచ్చింది అంటావు అన్నారు. ఆయన అన్నట్లే నాకు కథ బాగా నచ్చింది అని... చరణ్ తెలిపారు.

 ఆయన్ను నమ్మి బ్లైండ్‌గా దూకేశాను

ఆయన్ను నమ్మి బ్లైండ్‌గా దూకేశాను

సుకుమార్ మాట నమ్మి బ్లైండ్‌గా దూకేశాను, ఆ తర్వాత కథ నేరేషన్ మొదలైంది, అది విని మెస్మరైజ్ అయ్యాను, అలాంటి నేరేషన్ కానీ, అలాంటి స్క్రీన్ ప్లే నేను ఇంత వరకు వినలేదు అని రామ్ చరణ్ తెలిపారు. అలాంటి సబ్జెక్ట్ నాకు వచ్చినందుకు నా అదృష్టంగా భావించాను అని తెలిపారు.

చుక్కులు చూపించారు

చుక్కులు చూపించారు

సెట్స్ మీదకు రాకముందే సుక్కూ చుక్కలు చూపించాడు. ఈ సినిమాకు ముందు చాలా లుక్స్ ట్రై చేశాము. దాదాపు 15 నుండి 16 ట్రై చేశాం. లూజ్ ప్యాంట్స్, బెల్ బాటమ్స్, ట్రైజర్స్ ఇలా రకరకాలు లుక్స్ ట్రైచేశాము. చివరకు లుంగీ లుక్ ఓకే అయింది అని చరణ్ తెలిపారు.

బన్నీ కొడుకు అయాన్ లుంగీ స్టిల్ గురించి

బన్నీ కొడుకు అయాన్ లుంగీ స్టిల్ గురించి

ఇంటర్నెట్లో వైరల్ అయినా అల్లు అయాన్ లుంగీ స్టిల్ గురించి చరణ్ మాట్లాడుతూ.... అల్లు అర్జున్ ఫోన్ చేసి మా అబ్బాయి అయాన్ రంగస్థలం పాటలు వింటూ మా చెవులు పగిలిపోయేలా చేస్తున్నాడు, వీడిని మీ ఇంటికి పంపిస్తాను అంటే.... నేను సినిమాలో వేసుకున్న లాంటి బట్టలు వాడికి సరిపోయేలా ఎగ్జాక్ట్‌గా టైలర్‌తో కుట్టించి నేనే గిఫ్టుగా పంపాను అని రామ్ చరణ్ తెలిపారు.

English summary
Tollywood Mega Power star Ram Charan about Director Sukumar and Rangasthalam movie. Rangasthalam is an upcoming Indian Telugu period revenge drama directed by Sukumar and produced by Y. Naveen, Y. Ravi Shankar and C. V. Mohan under the banner Mythri Movie Makers. The film stars Ram Charan and Samantha Akkineni in the lead roles, Aadhi Pinisetty,Jagapathi Babu and Prakash Raj played other crucial supporting roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X