తమన్నా పక్కన మెరిసిపోతూ.. డాషింగ్‌గా.. థ్యాంక్యూ డాడీ.. రాంచరణ్

ప్రముఖ సినీ నిర్మాత,వ్యాపారవేత్త, రాజకీయవేత్త డా.టి. సుబ్బిరామిరెడ్డి. ఇటీవల విడుదలైన మెగాస్టార్ చిరంజీవి చారిత్రాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి' ప్రపంచవ్యాప్తంగా అఖండ విజయం సాధించడంతో ఆ చిత్ర యూనిట్‌ను సుబ్బిరామిరెడ్డి ప్రత్యేకంగా సన్మానించారు. బుధవారం రాత్రి పార్క్ హయత్‌లో జరిగిన కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో మెగాస్టార్ చిరంజీవిని ఘనంగా సుబ్బిరామిరెడ్డి సత్కరించారు.

ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు విక్టరీ వెంకటేశ్, జీవిత రాజశేఖర్ దంపతులు, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, ఛార్మి, కేథరిన్, నిహారిక, అశ్వినీదత్, బోనీకపూర్, సురేష్ బాబు, డైరెక్టర్లు కోదండరామిరెడ్డి, క్రిష్,సుకుమార్, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్, రాజకీయ నాయకులు రఘురామ కృష్ణంరాజు, మురళీమోహన్, కేవీపీ, పీవీపీ, సీఎం రమేష్, దానం నాగేందర్, జేసీ పవన్‌రెడ్డి, క్రీడారంగం నుంచి చాముండేశ్వరినాథ్, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. సన్‌షైన్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ గురువారెడ్డి చిరంజీవి మీద అభిమానంతో 'సైరా' ప్రత్యేక కేక్‌ను తయారు చేయించి మెగాస్టార్‌కు బహూకరించారు.

సైరా నరసింహారెడ్డి అనగానే

సైరా నరసింహారెడ్డి అనగానే

పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ..‘‘సైరా నరసింహారెడ్డి అనగానే సైరా అంది ఫస్ట్ చిరంజీవి గారు. నెక్ట్స్ సైరా అంది మా చరణ్ బాబు. సైరా నరసింహారెడ్డి అనే సినిమాను జనంలోకి తీసుకెళ్లగానే జనమంతా ‘సైరా' అన్నారు. ఇలాంటి గొప్ప సినిమాను నిర్మించిన చరణ్ బాబుకు, మా ఎవర్‌గ్రీన్ హీరో చిరంజీవి, మా డైరెక్టర్ సురేందర్‌రెడ్డికి అభినందనలు. మంచి సినిమా ఎక్కడుంటే అక్కడ తాను ఉండి ప్రోత్సహించే సుబ్బరామిరెడ్డి గారికి కృతజ్ఞతలు.'' అన్నారు.

చరణ్‌తో ‘ధృవ' సినిమా ఏ ముహూర్తాన తీశానో కానీ

చరణ్‌తో ‘ధృవ' సినిమా ఏ ముహూర్తాన తీశానో కానీ

డైరెక్టర్ సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ..‘‘నేను ఏ ముహూర్తాన చరణ్‌తో ‘ధృవ' సినిమా తీశానో కానీ, నన్ను ఒక మంచి సబ్జెక్ట్, టీమ్ మధ్య నిలబెట్టాడు. థ్యాంక్యూ చరణ్. నేను ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి కారణం చిరంజీవిగారు ఇచ్చిన సపోర్ట్, ధైర్యమే. మెగాస్టార్ ప్రోత్సాహమే నన్ను ఇంతదూరం తీసుకొచ్చింది.'' అన్నారు.

సుబ్బిరామిరెడ్డిగారి గొప్పతనం..

సుబ్బిరామిరెడ్డిగారి గొప్పతనం..

అల్లు అరవింద్ మాట్లాడుతూ..‘‘ఎక్కడ మంచి సినిమా ఉన్నా దాన్ని తీసుకొచ్చి గౌరవించడం అన్నది సుబ్బిరామిరెడ్డిగారి గొప్పతనం. ఆంధ్రప్రదేశ్‌లో సినిమాను ప్రేమించే అందరి కడుపులు నిండడమే కాకుండా మా కుటుంబం కడుపులు చాలా నిండిపోయేటట్టుగా చేసిన సినిమా ‘సైరా'. అందుకు చిరంజీవిగారికి ధన్యవాదాలు. ఇటువంటి గొప్ప సినిమాను మా మేనల్లుడు తీశాడనే గొప్పతో పాటు చిన్న ఈర్ష్య కూడా ఉంది.'' అన్నారు.

థ్యాంక్యూ డాడీ

థ్యాంక్యూ డాడీ

రామ్ చరణ్ మాట్లాడుతూ..‘‘సుబ్బిరామిరెడ్డి గారి ఫంక్షన్ లేకపోతే ఆ సంవత్సరం మాకు ఏదో వెలితిగా ఉంటుంది. తమన్నా పక్కన మెరిసిపోతూ ఆయన డాషింగ్‌గా కనిపిస్తున్నారు. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్యూ డాడీ. నేనేదో ఆయకు ప్రొడ్యూసర్ అని అందరూ అంటున్నారు. కానీ, నేను అలా భావించట్లేదు. ఆయన సినిమాలో నేను కూడా ఒక వర్కర్ అంతే. ఆయన చిటికేస్తే ఎంతోమంది ప్రొడ్యూసర్‌లు ముందుకొస్తారు. అందుకే నేను ప్రత్యేకంగా ఆ స్థాయిని తీసుకోదల్చుకోలేదు. ఆయన సంకల్పమే మమ్మల్నందరినీ కలిపి ఆయన కోసం, పైన ఉన్న నరసింహారెడ్డి కోసం పనిచేసి ఇంతపెద్ద సినిమా చేయగలిగే అవకాశం మాకు ఇచ్చారు. ఇక్కడికి విచ్చేసిన అందరికీ థ్యాంక్యూ.'' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X