రాజమౌళి కోసం కాదు, ఇండస్ట్రీ మంచి కోసమైనా ‘సైరా’ను కొట్టాలి: రామ్ చరణ్
Recommended Video

టాలీవుడ్లో రికార్డుల పరంగా చూస్తే రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క ముఖ్య పాత్రల్లో నటించిన 'బాహుబలి' మూవీ టాప్. చిరంజీవి తాజాగా నటిస్తున్న 'సైరా నరసింహారెడ్డి' చిత్రం ఇప్పటి వరకు ఉన్న రికార్డులను బద్దలు కొడుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో త్వరలో రామ్ చరణ్-ఎన్టీఆర్‌తో రాజమౌళి చేసే మూవీ 'సైరా'ను పడగొడుతుందని అంచనా వేస్తున్నారు. తాజాగా 'సైరా' మూవీ టీజర్ రిలీజ్ కార్యక్రమంలో నిర్మాత రామ్ చరణ్‌కు ఈ రికార్డుల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

ఇండస్ట్రీ మంచి కోసమైనా మా సినిమాను పడగొట్టాలి
ఇండస్ట్రీకి మంచి జరుగాలంటే....ఒక సినిమా రికార్డులను మరొక సినిమా పడగొడుతూ వెళ్లాలి. రేపు మా సినిమా ఏదైనా సినిమాను కొడితే... తర్వాత మా సినిమాను కొట్టే సినిమా రావాలని కోరుకుంటాను అని రామ్ చరణ్ అన్నారు.

రాజమౌళి సినిమా వరకు కాదు, అంతకు ముందే
‘సైరా' సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో వస్తుంది. ఈ లోగా రాజమౌళి బాహుబలి రికార్డులను బద్దలు కొట్టే మరొక సినిమా రావాలి. సమ్మర్లో వచ్చే మిగిలిన సినిమాలు కూడా ఒక సినిమాను కొట్టే విధంగా మరొక సినిమా ఉండాలి. అపుడే ఇండస్ట్రీ స్థాయి పెరుగుతూ ముందుకు వెళుతుందని రామ్ చరణ్ అన్నారు.

మనస్పూర్తిగా, స్వచ్ఛంగా కోరుకుంటున్నాను
ఇండస్ట్రీలో పోటీ వాతావరణం అనేది ఉండాలి. మన సినిమాను కొట్టే సినిమా రాకూడదు అని కోరుకోవడం సరైంది కాదు అని నా అభిప్రాయం. బాహుబలి వచ్చే వరకు మన మార్కెట్ ఇంత ఉందని తెలియదు. రేపు ఏదైనా సినిమా దాన్ని కొడితే... మన మార్కెట్ పెరిగిందని సంతోష పడాలి అని అర్థం వచ్చేలా రామ్ చరణ్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

స్పర్దయా వర్దతే విద్య
మధ్యలో పరుచూరి గోపాలకృష్ణ మైక్ అందుకుని... స్పర్దయా వర్దతే విద్య అంటారు, అంటే అసూయ పడకూడదని అర్థం. నువ్వు కొట్టావు కదా... నేను కొట్టి చూపిస్తాను అని పోరాడే తత్వం ఉండాలి అని సూచించారు.


Click it and Unblock the Notifications











