twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సైరా’కు భారీ బడ్జెట్, లాభాలు రాకున్నా సంతోషమే: రామ్ చరణ్

    By Bojja Kumar
    |

    Recommended Video

    Ram Charan Speech @Sye Raa Narasimha Reddy Teaser Launch Event

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ బేనర్లో రామ్ చరణ్ నిర్మిస్తున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. రేపు మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా నేడు టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామ్ చరణ్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది సమ్మర్లో సినిమా విడుదల చేస్తున్నామని, టీజర్ విడుదల ఇంత ముందుగా విడుదల చేయడానికి కారణం... నాన్నగారి పుట్టినరోజు సందర్భమే అన్నారు. సినిమాపై మేమంతా ఎంత ఎగ్జైటెడ్ గా ఉన్నామో? ప్రేక్షకులు, అభిమానుల్లోనూ ఉంది. నరసింహారెడ్డి ఎలా ఉంటాడో చాలా మందికి తెలుసుకోవాలని ఉంది. అందుకే ఈ రోజును టీజర్ రిలీజ్ కోసం ఎంచుకున్నామని తెలిపారు.

    12 ఏళ్ల నుండి...

    12 ఏళ్ల నుండి...

    పరుచూరి బ్రదర్స్ నాన్నగారితో ఎన్నోసినిమాలు చేశారు. పన్నెండేళ్ల క్రితం నుండి పరుచూరి గారు ప్రతి సంవత్సరం మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఆ సినిమా గురించి మీ డాడీతో మాట్లాడు అనేవారు. సరైన టీమ్, బడ్జెట్, టెక్నాలజీ లేక ఎన్నో కారణాల వల్ల పోస్ట్‌పోన్డ్ అవుతూ వచ్చింది. వాళ్ల తపన, సంకల్పం వల్లే ఈ ప్రాజెక్ట్ నేడు రూపుదిద్దుకుంది. పన్నెండేళ్లు వారి సాధన ఇపుడు ఫలించింది. ఇలాంటి సినిమాను నాన్నకు ఇచ్చిన వారికి లైఫ్ లాంగ్ మా ఫ్యామిలీ గ్రేట్‌ఫుల్‌గా ఉంటుందని రామ్ చరణ్ అన్నారు.

    సురేందర్ రెడ్డి బాధ్యత తీసుకున్నారు

    సురేందర్ రెడ్డి బాధ్యత తీసుకున్నారు

    దర్శకుడు సూరితో ధృవ సమయం నుండి జర్నీ చేస్తున్నాను. ఏదో నేను సినిమా చేయమని అడిగాను కదా అని కాకుండా... రెస్పాన్సిబిలిటీ తీసుకుని చాలా ఆలోచించి మొదలు పెట్టారు. మంచి టీమ్ కుదరడంతో 12 సంవత్సరాలుగా డాడీ నాన్చుతున్న ఈ మూవీ ఒక్క సిట్టింగుతో ఓకే అయిందని చరణ్ అన్నారు.

     నాన్నగారిలో ఆ సత్తా ఉంది

    నాన్నగారిలో ఆ సత్తా ఉంది

    ఒక నటుడు అనేవాడు ఏ కథైనా చేయగలగాలి, నాన్నగారిలో ఆ సత్తా ఉంది. ఆయన కూడా నేను చేస్తాను అని ఆకాన్ఫిడెన్స్ ఇచ్చారు. అందువల్లే మేము మరింత ధైర్యంగా ముందుకు వెళ్లాం. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామన్నారు.

    భారీ బడ్జెట్ ఖర్చు చేశాం

    భారీ బడ్జెట్ ఖర్చు చేశాం

    బడ్జెట్ ఎంత అనుకున్నారు? అనే ప్రశ్నకు రామ్ చరణ్ బదులిస్తూ.... బడ్జెట్ ఎంత అనేది చెప్పాలనుకోవడం లేదు. అలాంటి ఉద్దేశ్యం కూడా లేదు. కానీ భారీ బడ్జెట్‌తో తీస్తున్నాం. డాడీ డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి వెనక ముందు చూడకుండా దేనికీ వెనకాడకుండా ఎక్కువగానే పెట్టి చేస్తున్నామన్నారు.

    ప్రాఫిట్స్ వస్తే బోనస్, రాకున్నా సంతోషమే

    ప్రాఫిట్స్ వస్తే బోనస్, రాకున్నా సంతోషమే

    ఈ సినిమాకు ప్రాఫిట్స్ వస్తే బోనస్... రాక పోయినా ఆనందమే. సినిమాకు ఎంత అవసరమే అంత ఖర్చుపెడుతున్నాం. ఇంతలోనే తీయాలని లిమిట్స్ ఏమీ పెట్టుకోలేదు. బాగా రావడానికి ఎలాంటి ఖర్చుకు వెనకాడటం లేదన్నారు.

    35 సంవత్సరాల డ్రీమ్

    35 సంవత్సరాల డ్రీమ్

    నాన్నగారు నాతో తరచూ ఓ విషయం అనేవారు. నీ మీద నాకు జెలస్ ఉంది... నీకు రెండో సినిమా(మగధీర)కే ఒక మంచి సోషియో ఫాంటసీ కాస్టూమ్ డ్రామా సినిమా చేసే అవకాశం వచ్చింది. నేను 35 సంవత్సరాలు 150 సినిమాలు చేసినా... ఇప్పటి వరకు ఒక్క కాస్టూమ్ డ్రామా సినిమా రాలేదన్నారు. సైరా నరసింహారెడ్డి ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్. దీనికి ఖర్చు, ప్రాఫిట్స్ ఎంత పెడుతున్నాం అనేది ఆలోచించడం లేదు. ఆయనకు కావాల్సినట్లు చేయడమే మేము బ్లెస్సింగ్ గా భావిస్తున్నామని రామ్ చరణ్ అన్నారు.

    అన్ని భాషల్లో స్ట్రైట్ రిలీజ్

    అన్ని భాషల్లో స్ట్రైట్ రిలీజ్

    ఈ సినిమాను అన్ని సౌతిండియన్ లాంగ్వేజుల్లో స్ట్రైట్ రిలీజ్ చేస్తున్నాం. ఇలాంటి సినిమా చేయడం గర్వంగా ఫీలవుతున్నాం. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తీసిన సినిమా ఎలా ఉంది అనేది చూసిన తర్వాత ప్రజలు చెప్పాలి.

    ఆయన వస్తే ఏం బావుంటుంది?

    ఆయన వస్తే ఏం బావుంటుంది?

    ఇక్కడ చిరంజీవిగారు లేని లోటు కనిపిస్తోందని ఓ మీడియా ప్రతినిధి అడగ్గా.... ‘నా బర్త్ డే టీజర్ చూడండి అని ఆయనే వచ్చి చెప్పడం అంత బావుంటుందా? టీజర్ మీద మీ రియాక్షన్ ఏమిటి అనేది ఆయనకు గిఫ్టుగా ఇవ్వాలని ఈ ప్రోగ్రాం ప్లాన్ చేశామని రామ్ చరణ్ తెలిపారు.

    English summary
    Ram Charan about Sye Raa Narasimha Reddy teaser. The Movie ft. Megastar Chiranjeevi, Amitabh Bachchan, Jagapathi Babu, Nayanthara, Tamanna, Kiccha Sudeep, Vijay Sethupathi and Brahmaji among others. The magnum opus is being Directed by Surender Reddy. Produced by Ram Charan under Konidela Production Company. Music composed by Amit Trivedi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X