ఉపాసన ఏమో అలా.. కేవలం ఆ సమయంలోనే కలిసేవాళ్లం.. రామ్ చరణ్ కామెంట్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో ఓ మాదిరిగా ఉంటారు. మరీ అన్ని విషయాలపై స్పందించడు. ఏదైనా అవసరమనిపిస్తేనే సెటైర్, కామెంట్స్ వంటివి వేస్తుంటాడు. మీడియాతోనూ అలాగే ఇంటరాక్ట్ అవుతుంటాడు. ఏదైనా ప్రత్యేక సందర్భం ఉంటే తప్పా.. వార్తల్లోకి ఎక్కడు. తాజాగా రామ్ చరణ్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కు విచ్చేశాడు. అక్కడ ఓ ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ.. అనేక విషయాలపై స్పందించాడు.

ప్రతీ ఏడాది..

ప్రతీ ఏడాది..

చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో ప్రతీ ఏడాది ఇండిపెండెన్స్ డే సెలెబ్రేషన్స్ జరుగుతుంటాయి. ప్రతీ సంవత్సరం అల్లు అరవింద్ కచ్చితంగా విచ్చేస్తారు. ఆయనతో పాటు చిరంజీవి లేదా రామ్ చరణ్ ఇలా ఎవరో ఒకరు కూడా వెంట వస్తారు. ఈ సారి రామ్ చరణ్ ఆ వేడుకలకు హాజరయ్యాడు. ఈ మేరకు బయటకు వచ్చిన ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆర్ఆర్ఆర్‌పైనా..

ఆర్ఆర్ఆర్‌పైనా..

ఆర్ఆర్ఆర్ సినిమా, అల్లూరి సీతారామరాజు పాత్ర, షూటింగ్‌ పున: ప్రారంభం వంటివాటిపై రామ్ చరణ్ నోరు విప్పాడు. అల్లూరి కొత్త తరహాలో రాజమౌళి చూపిస్తాడని, అయితే షూటింగ్‌లు ఎప్పుడు మొదలవుతాయో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నామని, త్వరలోనే అంతా బాగవుతుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నాడు.

ఇంట్లోనే ఉంటూ..

ఇంట్లోనే ఉంటూ..

ఈ లాక్ డౌన్ కాలంలో అందరూ హీరోలు ఏదో ఒక పని చేసుకుంటూనే ఉన్నారని, కొత్తగా ఏవైనా నేర్చుకున్నారా? అని అడిగితే.. కొత్తగా ఏమీ నేర్చుకోలేదు కానీ చేసే పనులకే ఇంకాస్త ఎక్కువ సమయాన్న కేటాయించానని తెలిపాడు. వ్యాయామానికి ఎక్కువ సమయం కేటాయించానని పేర్కొన్నాడు. లాక్ డౌన్‌లో మొదటి నెల చాలా కష్టంగా గడించిందని చెప్పుకొచ్చాడు.

Recommended Video

#NS20 : Director Sekhar Kammula On Naga Shourya's New Movie First Look
ఆ టైం‌లో మాత్రమే..

ఆ టైం‌లో మాత్రమే..

ఇక లాక్ డౌన్ విధించిన మొదటి నెలలో అందరూ ప్రకృతి బాగుందని, వాతావరణ కలుషితం కావడం లేదని సంబరపడ్డారు కానీ తరువాత పరిస్థితి మారిపోయిందని తెలిపాడు. ఇక మొదటి నెలలో తాను ఇంట్లో ఒక్కడినే ఉండాల్సి వచ్చిందని అన్నాడు. ఉపాసన నిత్యం తన హాస్పిటల్ పనులతో బిజీగా ఉండేదని కేవలం తినే సమయాల్లోనే తామిద్దరం కలిసే వాళ్లమని పేర్కొన్నాడు. అలా ఒక నెల మొత్తం ఇంట్లో ఒక్కడినే క్వారంటైన్ అయ్యాయని సరదాగా అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X