Ram Charan: ఉపాసన ప్రెగ్నెన్సీపై రామ్ చరణ్ రియాక్షన్.. అక్కడే ఆ మ్యాజిక్ జరిగందంటూ!
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా ద్వారా దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ మూవీ అనేక అవార్డులతో పాటు ఆస్కార్ ను సైతం కొల్లగొట్టింది. దీంతో రామ్ చరణ్ ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయి గ్లోబల్ స్టార్ అయ్యాడు. అందుకే ఆయనకు ప్రతిష్టాత్మక వేదికలపై మాట్లాడేందుకు పిలుపు వస్తోంది. తాజాగా శ్రీనగర్ లో జరిగిన జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సదస్సులో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు రామ్ చరణ్. ఈ వేదికపై తన భార్య ఉపాసన ప్రెగ్నెన్సీపా ఆసక్తికర విషయం చెప్పుకొచ్చాడు.
పర్యాటక అభివృద్ధి:జమ్ము, కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు అట్టహాసంగా స్టార్ట్ అయ్యాయి. మే 22 నుంచి 24వ వరకు అంటే మూడు రోజులపాటు జరిగిన ఈ సదస్సుకు దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు భారీగా హాజరయ్యారు. టూరిజం డెవలప్‌మెంట్, ఇండియాలో పర్యాటక అభివృద్ధి అంశాల లక్ష్యంగా నిర్వహిస్తున్న జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సదస్సు కోసం వెళ్లి రామ్ చరణ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు.

ప్రత్యేక స్థానం:జీ20 సదస్సులో తన భార్య ఉపాసన ప్రెగ్నెన్సీపై ఆసక్తికర సమాధానం ఇచ్చాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈ సందర్భంగా జపాన్ దేశం తన జీవితంలో ఎలా ప్రత్యేక స్థానాన్ని కలిగిందో వివరించాడు. జపాన్ తనకు ఇష్టమైన ప్రదేశంగా పేర్కొంటూ తన భార్య ఉపాసనతో పాటు పుట్టబోయే బిడ్డకు కూడా ఈ ప్లేసుతో సంబంధం ఉందని రివీల్ చేశాడు.

జ్ఞాపకంగా :దేశాల్లో కళాఖండాలు సేకరిచండంపై "నాకు ఏ దేశానికి వెళ్లిన అక్కడి కళాఖండాలను సేకరించే అలవాటు ఉంది. అది ఎలా వచ్చిందో తెలియదు. నాకు కళాఖండాలపై ఆసక్తి లేని నాకు అర్థవంతంగా ఉండి, ఆ సిటికీ నేను కనెక్ట్ అయ్యేలా, మళ్లీ వెళ్లినప్పుడు ఆ ప్రదేశాన్ని మంచి జ్ఞాపకంగా ఉంచుకునేలా కలెక్ట్ చేస్తాను " అని రామ్ చరణ్ తెలిపాడు.

నవ్వుతూ చెర్రీ:"నాకు ఇష్టమైన ప్రదేశాల్లో యూరప్ ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు ఆ జాబితాలో జపాన్ కూడా చేరింది. నా భార్య ఉపాసన ప్రస్తుతం గర్భవతి. ఆమెకు ఏడో నెల. ఈ మ్యాజిక్ జపాన్ లోని జరిగింది. అందుకే నాకు జపాన్ చాలా ప్రత్యేకం" అని నవ్వుతూ రామ్ చరణ్ చెప్పాడు. కాగా గతేడాది అక్టోబర్ లో RRR బృందంతోపాటు రామ్ చరణ్, ఉపాసన జపాన్ లో పర్యటించిన విషయం తెలిసిందే.

అధికారిక ప్రకటన:ఈ క్రమంలోనే జపాన్ లో రామ్ చరణ్-ఉపాసన దంపతులు అక్కడ టైమ్ స్పెండ్ చేశారు. తర్వాత డిసెంబర్ 12న మెగాస్టార్ చిరంజీవి తమ కోడలు ఉపసాన ప్రెగ్నెన్సీ అనే గుడ్ న్యూస్ ను అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది.


Click it and Unblock the Notifications











