'జంజీర్' రీమేక్ పై పెదవి విప్పిన రామ్ చరణ్
గత కొద్ది రోజులుగా రామ్ చరణ్ బాలీవుడ్ మెగా హిట్ జంజీర్ ని రీమేక్ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఆ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ చేయనున్నారని మీడియా కోడై కోస్తోంది. ఈ విషయమై ఓ లీడింగ్ ఆంగ్ల దిన పత్రిక ఆయన్ని సంప్రదించింది. రామ్ చరణ్ మాట్లాడుతూ..నేను చాలా స్క్రిప్టులు బాలీవుడ్ ఎంట్రీ కోసం విన్నాను. వాటిలో ఏదీ నన్ను ఎక్సైట్ చేయలేకపోయింది. నేను లవర్ బోయ్ గా బాలీవుడ్ లో ఎంట్రీ అవ్వదలుచుకోలేదు. జంజీర్ చిత్రం నాలో ఉన్న ట్యాలెంట్ ని వెలికి తీస్తుందనిపిస్తోంది. నన్ను కొత్తగా ప్రెజెంట్ చేస్తుందని నమ్మకం ఉంది అని అన్నారు. ఇక మిగతా వివరాలు చెప్పటానికి ఆయన ఆసక్తి చూపలేదు. ఈ జంజీర్ చిత్రం రీమేక్ ని రిలియన్స్ బ్యానర్ పై అమిత్ మెహ్రా నిర్మించనున్నారని,అపూర్వ లకియా దర్శకత్వంలో రూపొందనుందని తెలుస్తోంది.ఈ చిత్రం 2012 ఏప్రిల్‌లో సెట్స్‌పైకి వెళ్లనుందని చిత్ర వర్గాల సమాచారం.
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కలిసి నటించిన'జంజీర్' 1974లో మే 11న విడుదలై జంజీర్ అప్పట్లో సంచలన విజయం సాధించింది. ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ రోజుల్లోనే దాదాపు 5 కోట్లు వసూలు చేసి అమితాబ్‌కు యాంగ్రీ యంగ్‌మెన్‌గా తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్టింది. ప్రస్తుతం రామ్ చరణ్ సంపత్ నంది దర్శకత్వంలో 'రచ్చ'సినిమా చేస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రాన్ని ఎన్.వి. ప్రసాద్, పరాస్ జైన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











