Ram Charan: అనుష్క కోసం రామ్ చరణ్ చేపల పులుసు... మధ్యలో రానా ఇరుక్కున్నాడుగా!
అనుష్క కోసం రామ్ చరణ్ చెేపల పులుసు చేయబోతున్నాడు. అవునండీ నిజమే... కాకపోతే మధ్యలో రానా ఇరుక్కున్నాడు. అదేంటి అనుకుంటున్నారా... అనుష్క నటిస్తున్న తాజా చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనుష్క.. తన వంతుగా రెసిపీ ఛాలెంజ్ తో.. ప్రమోట్ చేస్తోంది. అందులో భాగంగా ప్రభాస్ కు మొదట ఛాలెంజ్ విసరిని ఈ బ్యూటీ... ప్రభాస్.. రామ్ చరణ్ కు ఛాలెంజ్ విసిరాడు. అసలు ఛాలెంజ్ స్వీకరించిన రామ్ చరణ్.. చేపల పులుసుతో రాబోతున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే...
టాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టి నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. ఇక ఈ సినిమాలో మొదటి సారిగా తన కన్న చిన్నవాడైన నటుడు నవీన్ పోలిశెట్టితో నటిస్తోంది. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. సినిమాపై ఇంట్రెస్టును కలిగించాయి. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రేపు అనగా సెప్టెంబర్ 7న థియేటర్లోకి రానుంది.

ఇక ఇప్పటికే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్స్ నవీన్ శెట్టి తన భుజాల మీద వేసుకుని చేస్తున్నాడు. ఇక అనుష్క కూడా తన వంతుగా... మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్ తో ప్రమోట్ చేస్తుంది బ్యూటీ. ఇక అనుష్క మొదట.. ప్రభాస్ కు ఛాలెంజ్ విసిరింది. తనకు నచ్చిన రెసిపీ రాసి పంపాలని ఛాలెంజ్ విసిరింది ఈ భామ. ఇక ఈ అనుష్క చెబితే.. ప్రభాస్ చేయకుండా ఉంటాడా.. వెంటనే తనకు నచ్చిన తనకు నచ్చిన రొయ్యల పులావ్ ఎలా చేయాలో చెప్పుకు వచ్చాడు.
అంతే కాదు.. తన ఫ్రెండు రామ్ చరణ్ తేజ్ కు ఛాలెంజ్ విసిరాడు. ఇక ప్రభాస్, రామ్ చరణ్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఫ్రెండ్ ప్రభాస్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన రామ్ చరణ్... తన వంతుగా ఓ రెసిపీ చేయబోతున్నాడు. ఈమేరకు ఆయన తన సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. రామ్ చరణ్ తన ఫేవరెట్ రెసిపీ నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో చెప్పుకొచ్చాడు.

రామ్ చరణ్ చేసిన పనికి రానా కూడా బుక్కయ్యాడు. అనుష్క ప్రభాస్ ను బుక్ చేస్తే... ప్రభాస్.. రామ్ చరణ్ ను బుక్ చేశాడు. ఇక రామ్ ఇప్పుడు రానాకు బుక్ చేశాడు. ప్రభాస్ చాలెంజ్ ను యాక్సెప్ట్ చేసిన రామ్ చరణ్... తను రానాకు ఛాలెంజ్ విసిరాడు. మరి రానా తన ఫెవరెట్ రెసిపీ ఏంటో.. ఎలా చేస్తారో తెలుసుకోవాలంటే.. రానా ఛాలెంజ్ ను స్వీకరించేవరకు ఆగాలి.
ఇక చాలా సంవత్సరాల తర్వాత అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో రాబోతుంది. ఇక ఈ బ్యూటీ సరసన నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాతో అనుష్క మంచి విజయాన్ని అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అటు జాతి రత్నాలు తర్వాత నవీన్ చేస్తున్న సినిమా ఇదే. ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇక రేపు విడుదల కానున్న ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











