రాంచరణ్ తెగ నరికితే, వైరల్ సీన్.. ఇలాంటి ఐడియాలు బోయపాటికే వస్తాయా!

Recommended Video

Vinaya Vidheya Rama : Ram Charan's Mass Scenes Entertains Fans Alot | Filmibeat Telugu

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన తాజా చిత్రం వినయ విధేయ రామ. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాక్ స్టార్ దేవిశ్రీ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్, స్నేహ, ఆర్యన్ రాజేష్, ముఖేష్ రిషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంక్రాంత్రి కానుకగా నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బోయపాటి సినిమాల్లో కొన్ని యాక్షన్ సన్నివేశాలు హైలైట్ గా నిలిస్తుంటాయి. వినయ విధేయ రామ చిత్రంలోని ఓ సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

రాంచరణ్ షర్ట్ లేకుండా

రాంచరణ్ షర్ట్ లేకుండా

స్టార్ హీరోల సినిమాలు విడుదలైనప్పుడు అభిమానులు థియేటర్స్ నుంచే కొన్ని షాట్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. వినయ విధేయ రామ చిత్రంలో కూడా అలాంటి షాట్ ఒకటి వైరల్ అవుతోంది. ఈ సన్నివేశం చూస్తే దర్శకుడు బోయపాటి శ్రీను యాక్షన్ సన్నివేశాలపై ఎంతలా ద్రుష్టి పెడతాడో అర్థం అవుతుంది. ఆయన చిత్రాల్లో హింసాత్మక సన్నివేశాలు మరో స్థాయిలో ఉంటాయి. ఈ సీన్ లో రాంచరణ్ షర్ట్ లేకుండా కండలు తిరిగిన బాడీతో కనిపిస్తున్నాడు.

రాంచరణ్ నరికితే

రాంచరణ్ నరికితే

ఇద్దరు రౌడీలు రాంచరణ్ మీదికి దూసుకువస్తుంటారు. రాంచరణ్ వెనుకనుంచి తిరిగి వారిపై కత్తిని ఝుళిపిస్తాడు.. అంతే..రౌడీల తలలు గాల్లో ఎగుతాయి. ఆకాశంలో ఎగురుతున్న గద్దలు గాల్లోకి ఎగిరిన తలలేని అందుకుంటాయి. ఈ సన్నివేశానికి మాస్ ప్రేక్షకులు కేకలు పెడుతూ, విజిల్స్ కొడుతున్నారు. సోషల్ మీడియాలో రోమాలు నిక్కబొడుచుకునే సన్నివేశం అని కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి హింసాత్మక సన్నివేశాలు బోయపాటి సినిమాల్లో తప్పకుండా ఉంటాయి.

బోయపాటికే ఇలాంటి ఐడియాలు

బోయపాటికే ఇలాంటి ఐడియాలు

దర్శకుడు బోయపాటి ఎక్కువగా ద్రుష్టి పెట్టే అంశం యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే. ఆ సన్నివేశాలకు తగినంత ఎమోషన్ జోడిస్తారు. కాస్త కుటుంబ బంధాలని కూడా చూపిస్తారు. భీభత్సమైన యాక్షన్ సన్నివేశాలు రూపొందించే ఐడియా బోయపాటికే వస్తాయా అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

రంగస్థలం తర్వాత

రాంచరణ్ రంగస్థలం తర్వాత చేసిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఏమేరకు సత్తా చాటుతుందో చూడాలి. రాంచరణ్ ఈ చిత్రంలో రాంబో తరహాలో కండలు తిరిగిన శరీరం, ఒంటిపై టాటూలతో కనిపిస్తున్నాడు. అజార్బైజాన్ లో ఈ సన్నివేశాలు చిత్రకరించినట్లు తెలుస్తోంది. వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X