రామ్ చరణ్ మళ్ళీ దాసరిని
రామ్ చరణ్ తాజాగ్ ఓ ట్వీట్ చేసారు. అందులో..గ్రేట్ మైండ్ డిస్కస్ ఐడియాస్,ఏవరేజ్ మైండ్స్ డిస్కస్ ఈవెంట్స్, స్మాల్ మైండ్స్ డిస్కస్ పీపుల్ అని రాసారు. అయితే ఈ ట్వీట్ క్యాజవల్ గా రాసిన కొటేషనా లేక ఎవరినన్నా ముఖ్యంగా దాసరిని ఉద్దేశించి అన్న మాటా అనేది అందరికి సందేహం వచ్చింది. దాసరికి, రామ్ చరణ్ కీ జరుగుతున్న కోల్డ్ వార్ గురించి తెలిసున్న వారంతా ఇది ఖచ్చితంగా దాసరికి కౌంటరే అంటున్నారు.ఆయన జనాల్ని డిస్కస్ చేసి స్మాల్ మైండ్ అయ్యాడని రామ్ చరణ్ ఉద్దేశ్యం అంటున్నారు.
ఇక గత కొంత కాలంగా దాసరి, రామ్ చరణ్ కీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వివాదం సాగుతోంది. అయితే డైరక్ట్ గా ముఖాముఖాగా ఎవరూ ఎవర్ని కామెంట్ చెయ్యటం లేదు. ఇన్ డైరక్ట్ గా స్టైజిమీద దాసరి కామెంట్ చేస్తే దానికి రామ్ చరణ్ వెంటనే ట్విట్టర్ లో సమాదాన మిస్తున్నాడు. ఈ వివాదం మేస్త్ర్రి సినిమాకి దాసరికి నంది అవార్డు వచ్చినప్పటినుంచి మొదలైంది. అప్పుడు మగధీర పోటీ పడినా అవార్డు రాలేదు. ఆ తర్వాత నుంచి కౌంటర్ల వర్షం అందరికీ తెలిసిందే.


Click it and Unblock the Notifications











