రామ్ చరణ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో 'చరణ్ అర్జున్'
గీతా ఆర్ట్స్..తాజాగా రామ్ చరణ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఓ చిత్రం చేయటానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోంస 'చరణ్ అర్జున్' అనే టైటిల్ ని ఫిల్మ్ ఛాంబర్ లో రిజస్టర్ చేసింది. సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ కరణ్ అర్జున్ తరహాలో ఈ టైటిల్ పెట్టి అంతేరేంజి ఫవర్ ఫుల్ స్టోరీని రెడీ చేస్తున్నట్లు అంతర్గత సమాచారం. ఇక గత కొంత కాలంగా అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరూ విడివిడిగా తాము కలిసి పనిచేస్తామని ఇంటర్వూలలో చెప్తూనే వస్తున్నారు. అది అతి త్వరలోనే నిజం కాబోతోందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం కోసం పలు రకాల కథలు, స్టోరీ లైన్స్ అల్లు శిరీష్ వింటున్నారని సమాచారం. స్టోరీ లైన్ ఓకే కాగానే వెంటనే దర్శకుడుని, స్క్రిప్టుని రెడీ చేసే పనిలో ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక గీతా ఆర్ట్స్ ప్రస్తుతం నాగచైతన్య హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తోంది. అలాగే రామ్ చరణ్ తన తదుపరి చిత్రంగా మెరుపు(ధరణి దర్శకత్వంలో) కమిటయితే, అల్లు అర్జున్..వివి వినాయిక్ కాంబినేషన్ లో బద్రీనాధ్ రూపొందించటానికి సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.


Click it and Unblock the Notifications











