రామ్ చరణ్, అల్లు అర్జున్ జెండా పండుగ
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సంయుక్తంగా పాల్గొన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్ద బుధవారం జరిగిన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌లో ఈ ఇద్దరు స్టార్లతో పాటు నాగబాబు, అల్లు అరవింద్ పాల్గొని జెండా ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.

ఈ సందర్భంగా భారీ సంఖ్యలో మెగా అభిమాను తరలి వచ్చి తమ అభిమాన స్టార్లతో కలిసి జెండా పండుగ జరుపుకున్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ మాట్లాడుతూ.....స్వాతంత్రోధ్యమంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశం మరింత అభివృద్ధి బాటలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.


Click it and Unblock the Notifications











