»   » ఉత్తరఖండ్ : చరణ్, బన్నీ చెరో 10 లక్షల సాయం

ఉత్తరఖండ్ : చరణ్, బన్నీ చెరో 10 లక్షల సాయం

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : ఉత్తరఖండ్ వరద బాధితులకు మెగా కుటుంబ నుంచి ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రూ. 24 లక్షలు సాయం అందజేసిన సంగతి తెలిసిందే. తాజాగా రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా సాయం చేయడానికి ముందు కొచ్చారు. సోమవారం సాయంత్రం జరిగిన ఎవడు ఆడియో వేడుకలో రామ్ చరణ్, అల్లు అర్జున్ చెరో రూ. 10 లక్షలు సాయం ప్రకటిస్తున్నట్లు చిరంజీవి వెల్లడించారు.

ఉత్తరఖండ్ వరద బాధితులకు మెగా అభిమానులు కూడా తమ వంతు సాయం అందించడానికి ముందుకొచ్చారు. ఎవడు ఆడియో వేదిక‌గా పలువురు అభిమానులు జమ చేసిన మొత్తాన్ని చిరంజీవి చేతుల మీదుగా ఉత్తరఖండ్ వరద బాధితుల కోసం పీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించారు.

ఇలాంటి విప్పత్తులు జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ మానవతా దృక్ఫతంతో తమ వంతు సాయం చేయడానికి ముందుకు రావాలని, ఇలాంటి కార్యక్రమాలలో మెగా అభిమానులు ముందుండటం ఎంతో సంతోషంగా ఉందని చిరంజీవి వ్యాఖ్యానించారు. చిరంజీవి వ్యాఖ్యలతో మరికొందు కూడా సహాయం చేయడానికి ముందుకొస్తున్నారు.

రామ్‌చరణ్, శ్రుతిహాసన్, అమీజాక్సన్ హీరో హీరోయిన్లుగా అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ అతిథి పాత్రల్లో రూపొందిన చిత్రం 'ఎవడు'. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'దిల్' రాజు నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. సోమవారం సాయంత్రం ఈ చిత్రం ఆడియో వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో సీడీని చిరంజీవి ఆవిష్కరించి రామ్‌చరణ్, అల్లు అర్జున్‌కి ఇచ్చారు.

English summary
Ram Charan and Allu Arjun donated Rs 10 lakhs each for Uttarakhand victims relief. The young heroes handed over the cheques to Megastar and Union Minister for Tourism Chiranjeevi at Yevadu audio release function on Monday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu