దసరా స్పెషల్: రామ్ చరణ్, బన్నీ ఎక్కడ ఉన్నారో తెలుసా?
మెగా ఫ్యామిలీ హీరోస్ రామ్ చరణ్, అల్లు అర్జున్ దసరా వేడుకలను అత్తారింట్లో జరుపుకుంటున్నారు. తెలంగాణ ప్రాంతంలో జరిగే బతుకమ్మ వేడుకలు, దసరా సంబరాల్లో పాలు పంచుకుంటున్నారు. ఈ ఇద్దర్లు తెలంగాణ ప్రాంతానికి చెందిన అమ్మాయిలను పెళ్లాడిన సంగతి తెలిసిందే.
అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి అమ్మమ్మ స్వగ్రామమైన నల్లగొండ జిల్లా చింతపల్లి గ్రామమంలో సందడి చేశారు. ఇక రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి సేవా సమాజ్ బాలికా నిలయాన్ని సందర్శించారు.
బతుకమ్మ వేడుకల్లో రామ్ చరణ్
ఉపాసన కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సమాజ్ బాలికా నిలయాన్ని రామ్ చరణ్, ఉపాసన దంపతులు బుధవారం సందర్శించారు. ఇక్కడ జరిగిన బతుకమ్మ వేడుకల్లో సందడి చేశారు.
దసరా శుభాకాంక్షలు
సేవా సమాజ్ బాలికా నిలయానికి చెందిన అమ్మాయిలతో కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్న రామ్ చరణ్, ఉపాసన.

చింతపల్లి గ్రామంలో అల్లు అర్జున్
నల్లగొండ జిల్లాలోని చింతపల్లి గ్రామంలో అల్లు అర్జున్ సందడి చేశారు. స్టైలిష్ స్టార్ వచ్చిన విషయం తెలిసి భారీగా అభిమానులు తరలి వచ్చారు.
బ్యాంకాక్‌లో వరుణ్ తేజ్
మరో మెగా హీరో వరుణ్ తేజ్ బ్యాంకాక్ నుంచి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ వెంకీతో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











