బయటోడు కాబట్టే అనుమానం, పవన్ కళ్యాణే మొదటి వ్యక్తి, అదే సత్యం: రామ్ చరణ్

By Bojja Kumar

Recommended Video

Megastar Chiranjeevi Birthday Celebrations 2018 Event

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ఒక రోజు ముందుగానే అభిమానుల కోసం బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ వేడుకకు మెగా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, నాగబాబుతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, అల్లు అర్జున్ ప్రసంగం ఆకట్టుకుంది. 'సైరా' టీజర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇది నాన్నగారి బర్త్ డే అయినా.... టీజర్ ద్వారా మనందరికీ గిఫ్ట్ ఇచ్చినట్లు అనిపిస్తోంది. సినిమా బాగా రావడానికి టీమ్ మొత్తం కష్టపడి పని చేస్తోందన్నారు.

బయటోడు కాబట్టే అనుమానాలు

బయటోడు కాబట్టే అనుమానాలు

చాలా మందికి మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది మీద చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. హిందీ నుండి వచ్చాడు... ఎలా కొడతాడో అని అనుకుంటున్నారు. అతడి మ్యూజిక్ మన తెలుదనానికి సెట్టవుతుందా? లోకల్ ఫ్లేవర్ ఇవ్వగలడా? అని అంటున్నారు. అలా అనుమానపడే వారికి ఒకేటే చెబుతున్నాను.... ఈ రోజు విడుదలైన టీజర్‌కు చిరంజీవిగారు, విజుల్స్ ఒక ఎత్తయితే.... మ్యూజిక్ అనేది మరొక ఎత్తుగా నిలిచింది. ఆ మ్యూజిక్ కోసమే టీజర్ మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోంది అన్నారు. సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అదిరిపోవడం ఖాయం అన్నారు.

ముందు పవన్ కళ్యాణే చూశాడు, అదే సత్యం

ముందు పవన్ కళ్యాణే చూశాడు, అదే సత్యం

‘సైరా' టీజర్ ఉదయం 11.30 గంటలకు మీరు చూశారు. టీజర్ నా వద్దకు 10.45కి వచ్చింది. నాకు టీజర్ వచ్చిన వెంటనే మొదట బాబాయ్ పవన్ కళ్యాణ్‌కు పంపాను. ఈ విషయం మిమ్మల్ని ఉత్తేజపరచడానికో, ఆనంద పరచడానికో చెప్పడం లేదు. ఇది సత్యం... అని రామ్ చరణ్ అన్నారు.

బాబాయ్ అదిరిపోయిందన్నారు

బాబాయ్ అదిరిపోయిందన్నారు

11 గంటలకు బాబాయికి పంపితే... 11:10 గంటలకు ఆయన నుండి అదిరిపోయింది, థియేటర్లో చూడానికి వెయిట్ చేస్తాను అని రిప్లై ఇచ్చారు. ఆయన బ్లెస్సింగ్స్ తో మొదలైన ఈ టీజర్‌కు మీ బ్లెస్సింగ్స్ కూడా లభించడం ఆనందంగా ఉందని రామ్ చరణ్ అన్నారు.

చెర్రీని చూస్తుంటే గర్వంగా ఉంది

చెర్రీని చూస్తుంటే గర్వంగా ఉంది

మెగాస్టార్ చిరంజీవిగారు ఎప్పటికీ చరిత్రలో గుర్తుండిపోయే ఒక ఎపిక్ సినిమా చేయాలనుకున్నారు. అలాంటి సినిమా వాళ్ల అబ్బాయి మెగావపర్ స్టార్ గిఫ్టుగా ఇవ్వడం ఎంతో గొప్ప విషయం. ఎన్ని కోట్లు సంపాదించినా ఈ సంతృప్తి దొరకదు. చరణ్‌ను చూస్తుంటే గర్వంగా ఉందని బన్నీ అన్నారు.

 షేక్ అవ్వాల్సిందే

షేక్ అవ్వాల్సిందే

ఉదయం టీజర్ రిలీజ్ ప్రెస్‌మీట్లో రామ్ చరణ్‌ను ఒకరు ఓ మాట అడిగారు. ఈ విషయం నేను వారిని విమర్శించడానికి చెప్పడం లేదు. చిరంజీవిగారు లేని వెలితి మాకు కనిపిస్తోందన్నారు... అలా ఫీలవ్వడం ఆయన అభిమానం. కానీ చిరంజీవి గారు ఎప్పుడు రావాలో అప్పుడు వస్తారు. అప్పుడు మొత్తం షేక్ అవ్వాల్సిందే.... అని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X