'గబ్బర్ సింగ్' చూసి వస్తున్న రామ్ చరణ్,అమలాపాల్

By Srikanya

హైదరాబాద్ : వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నటిస్తున్న చిత్రం 'నాయక్‌'. 'ది లీడర్' అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రానికి కాజల్‌, అమలాపాల్‌ హీరోయిన్లు గా చేస్తున్నారు . ఈ చిత్రం షూటింగ్ లో భాగంగా హీరో,హీరోయిన్స్ అయిన రామ్ చరణ్,అమలా పాల్ ఇద్దరూ గబ్బర్ సింగ్ చిత్రం చూస్తారు. ఇందుకోసం రీసెంట్ గా హైదరాబాద్ కొంపెల్లి సినీ ప్లానెట్ లో షూటింగ్ చేసారు. అమలాపాల్,రామ్ చరణ్ ఇద్దరూ ఓ బైక్ మీద ఈ సినిమాకు వచ్చి చూడటం వినాయిక్ షూట్ చేసారు.

అమలా పాల్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ... ''ప్రస్తుతం నేను నటిస్తున్న 'నాయక్‌', చిత్రంలోని పాత్ర నాకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. రామ్ చరణ్ తో చేయటం చాలా సంతోషంగా ఉంది. నాకు తెలుగులో గ్యారెంటీగా బ్రేక్ వస్తుంది'' అంటూ చెప్పుకొచ్చింది . 'నాయక్‌' చిత్రంలో ఆమె సెకండ్ హరోయిన్ గా చేస్తోంది. నాగచైతన్యతో చేసిన బెజవాడ చిత్రం ఆమెకు ఏ విధంగానూ ఉపయోగపడలేదు. తర్వాత విక్రమ్ సరసన చేసిన నాన్న చిత్రంతో ఆమెకు ఆఫర్స్ రావటం మొదలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆశలన్నీ 'నాయక్‌' పైనే ఉన్నాయి.

ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర డిఫెరెంట్ గా,ద్వి పాత్రలతో ఉండనుంది. ఇందులో రామ్ చరణ్ క్యారక్టర్ సమాజానికి ఉపయోగపడేలా ఉంటుంది. రామ్ చరణ్ ని అన్యాయాన్ని ఎదిరించే యువకుడిగా చూపిస్తున్నారు. గతంలో రామ్ చరణ్ తండ్రి చిరంజీవి చిత్రాలలో కూడా హీరో ..సమాజంలో జరిగే అన్యాయాలను ఎదురించి పోరాడే వాడు. అదే స్టైల్ లో రామ్ చరణ్ కూడా మెగాభిమానులను అలరించనున్నారు.

ఈ పాత్ర గురంచి రచయిత ఆకుల శివ మాట్లాడుతూ.. ''సందేశాన్ని కూడా వినోదం మేళవించి చెప్పినప్పుడే రక్తికడుతుంది. అదీ జనాదరణ ఉన్న హీరోతో చెప్పిస్తే ఎక్కువమందికి చేరుతుంది. చిరంజీవి రక్తదానం గురించి చెప్పారు కాబట్టే అవగాహన ఏర్పడింది. కాబట్టి మనం ప్రేక్షకులకు మంచి విషయం చెప్పాలనుకొన్నప్పుడు ఓ స్టార్‌ ద్వారా అతని ఇమేజ్‌కి తగ్గ కథలో మేళవించి చెప్పాలి. ఎక్కడా వాణిజ్య విలువలు వదులుకోకూడదు. ఇప్పుడు రామ్‌చరణ్‌ చిత్రంలో అంతర్లీనంగా కొన్ని విషయాలు చెప్పబోతున్నాము''అన్నారు.

ఈ చిత్రంలో కథ... తండ్రికిచ్చిన మాట కోసం తనయుడు ఏం చేశాడనే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. చిన్నపాటి టెన్షన్ తోపాటు మంచి యాక్షన్‌ సీన్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ ఏ మాత్రం తగ్గని సినిమా. చిరంజీవిగారితో 'ఠాగూర్‌' తీసిన రోజులు గుర్తొస్తున్నాయి. తప్పకుండా అందరినీ మెప్పించే సినిమా తీస్తున్నామని దర్శకుడు వినాయక్‌ అన్నారు. నిర్మాత ఈ చిత్రం గురించి మాట్లాడుతూ... చరణ్‌ని ఒక కొత్త తరహా పాత్రలో చూపెట్టబోతున్నారు అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X