రొమాన్స్ చేయడానికి హైదరాబాద్ వచ్చిన చరణ్!
నిన్న మొన్నటి వరకు తన తొలి బాలీవుడ్ సినిమా 'జంజీర్' షూటింగులో గడిపిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్...తాజాగా బ్రిటన్ భామతో రొమాన్స్ చేయడానికి హైదరాబాద్‌లోకి ఎంటర్ అయ్యాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎవడు' చిత్రంలో ఈ ఇద్దరు కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగు హైదరాబాద్‌లో జరుగుతోంది.
'ఎవడు' చిత్రంలో సమంత మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలోనే ఆమె షూటింగులో జాయిన్ కాబోతోంది. ఆలోపు వీరిపై సీన్లను కంప్లీట్ చేయనున్నారు. 'ఎవడు' చిత్రానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. రామ్ చరణ్, అల్లు అర్జున్ కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇదే.
ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. అయితే బన్నీ పోషిస్తున్న పాత్ర సినిమా మధ్యలోనే చనిపోతుంది. స్క్రిప్టు ప్రకారం ఈచిత్రం ఆసక్తికరంగా సాగుతుందని దర్శకుడు వంశీ పైడి పల్లి అంటున్నారు. గత సినిమాల కంటే విభిన్నమైన వ్యక్తిత్వం, బాడీ లాంగ్వేజ్‌తో ఈచిత్రంలో కనిపించున్నాడు. ఎవడు చిత్రం ఫోస్టర్లలో చెర్రీ లుక్స్ చూస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది.
రామ్ చరణ్‌తో తొలి సినిమా కావడంతో నిర్మాత దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే బృందావనం చిత్రంతో హిట్ కొట్టిన వంశీ పైడి పల్లి పక్కా ఎంటర్‌టైన్మెంట్ సబ్జెక్టుతో ఈ చిత్రాన్ని ప్లాన్ చేశారు. దేవిశ్రీప్రసాద్ బాణీలతో జోరుగా ముస్తాబవుతోన్న ఈ సినిమాకి, వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.


Click it and Unblock the Notifications











