బర్త్ డే వేడుకల్లో అపశ్రుతి.. పవన్ ఫ్యాన్స్‌కు చెర్రీ, బన్నీ సాయం.. ఎమోషనల్ అవుతున్న మెగా హీరోలు

పవన్ కళ్యాణ్ బర్త్ డే సెలెబ్రేషన్స్‌లో భాగంగా కుప్పంలో అపశ్రుతి జరిగింది. పవన్ కళ్యాణ్ భారీ ఫ్లెక్సీలను కడుతూ ముగ్గుర అభిమానులు దుర్మరణం చెందారు. విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ఈ ఘటనపై పవన్ కళ్యాణ్, ఆయన ఫ్యాన్స్ ఎమోషనల్ అయ్యారు. మృతుల కుటుంబాలకు అండంగా ఉంటామని మెగా హీరోలు, దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఈ మేరకు ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించారు.

రెండు లక్షల చొప్పున..

రెండు లక్షల చొప్పున..

ప్రమాదవశాత్తు చనిపోయిన ఫ్యాన్స్‌కు అండగా వకీల్ సాబ్ టీం నిలిచింది. మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేసింది. అభిమానుల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనట్టు వకీల్ సాబ్ చిత్రయూనిట్ ఓ ప్రకటన వెలువరించింది. అంతేకాకుండా ఏఎం రత్నం బ్యానర్ తరుపున కూడా రెండు లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించినట్టు తెలిపారు.

చిరు ఎమోషనల్..

చిరు ఎమోషనల్..

నిన్న కుప్పంలో జరిగిన దుర్ఘటనలో ముగ్గురు అభిమానులు కాలం చేశారు అనే వార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. మీ ఆరోగ్యం, మీ ప్రాణంకంటే ఏదీ విలువైనది కాదు. మీరంతా ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని నా మనవి.ఈ దుర్ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ వాళ్ళ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ చిరంజీవి ఎమోషనల్ అయ్యాడు.

బన్నీ సాయం..

బన్నీ సాయం..

ప్రమాదవశాత్తు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు దుర్మరణం చెందారనే వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ప్రతీ ఒక్క ఫ్యామిలీకి రెండు లక్షల ఆర్థిక సాయాన్ని అందించాలని అనుకుంటున్నాను. వాలంటీర్‌గా తమంతట తామే సాయం చేస్తోన్న ఎంతో మంది అభిమానులకు థ్యాంక్స్ అంటూ అల్లు అర్జున్ చేసిన పోస్ట్ అందర్నీ ఆకట్టుకుంటోంది.

Recommended Video

Wrong Gopal Varma Movie Poster Launch By Social Activist Sandhya
చెర్రీ సాయం..

చెర్రీ సాయం..

మీరందరూ బాగుంటేనే మేము బాగుంటము. పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు అభిమానంతో చేసే పనులు మీ ప్రాణాల మీదకు రావటం చాలా బాధాకరం. దయచేసి జాగ్రత్తగా ఉండండి అని చేతులెత్తి వేడుకుంటున్నా అని సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ అయ్యాడు. ఇక మరోవైపు వరుణ్ తేజ్ సైతం ఈ వార్తలు విని షాక్‌కు గురైనట్టు తెలిపాడు. ఇక రామ్ చరణ్ మృతుల కుటుంబాలకు 2.5 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X