సంజయ్ దత్‌ని కలిసిన చిరంజీవి, రాంచరణ్.. ఫోటోలు వైరల్!

Recommended Video

VVR Movie : Ram Charan And Chiranjeevi Meets Sanjay Dutt | Filmibeat Telugu

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. వినయ విధేయ రామ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కొన్ని రోజులుగా రాంచరణ్ ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే విడుదలైన వినయ విధేయ రామ ట్రైలర్ మాస్ ప్రేక్షకులని ఆకర్షిస్తోంది. బాలీవడ్ స్టార్ సంజయ్ దత్ ని రాంచరణ్ తాజాగా కలవడం ఆసక్తిగా మారింది.

 మున్నాభాయ్‌తో శంకర్ దాదా

మున్నాభాయ్‌తో శంకర్ దాదా

రాంచరణ్, చిరంజీవి ఇద్దరూ సంజయ్ దత్ ని మీట్ కావడం విశేషం. ఓ కార్యక్రమంలో భాగంగా వీరు ముగ్గురూ కలిసినట్లు తెలుస్తోంది. క్రేజీ స్టార్స్ ముగ్గురూ ఒక ప్రేములో కనిపించడంతో ఫోటోలు సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వీరు ముగ్గురూ కలసి సరదాగా సంభాషించుకుంటున్నారు.

చిరు, సంజయ్ దత్ స్నేహం

చిరు, సంజయ్ దత్ స్నేహం

సంజయ్ దత్ నటించిన మున్నాభాయ్ ఎంబిబిఎస్ చిత్రాన్ని చిరు తెలుగులో శంకర్ దాదా ఎంబిబిఎస్ గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి చిరు, సంజయ్ దత్ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. వీరిద్దరూ పలు సందర్భాల్లో కలుసుకున్నారు. తాజాగా రాంచరణ్ కూడా సంజయ్ దత్ ని కలవడం ఆసక్తిగా మారింది. సంజయ్ దత్ భాయ్ తో మిస్టర్ సి మాట్లాడుతున్నారు. వీరిద్దరూ కలసిన సాయంత్రం ఎప్పటికి గుర్తుండిపోతుంది అని ఉపాసన ట్వీట్ చేసింది.

బాలీవుడ్ గురించి

బాలీవుడ్ గురించి

ఇటీవల రాంచరణ్ ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ లో నటించడం గురించి స్పందించాడు. గతంలో రాంచరణ్ జంజీర్ చిత్రం తో చేసిన ప్రయత్నం విఫలం చెందిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లోనే బాలీవుడ్, హాలీవుడ్ స్థాయి చిత్రాలు నిర్మించబడుతున్నాయి. అలాంటప్పుడు బాలీవుడ్ తో అవసరం లేదు అని తేల్చేశాడు.

వినయ విధేయ రాముడిగా

వినయ విధేయ రాముడిగా

వినయ విధేయ రామ చిత్రం రేపే విడుదల కానుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో నటించాడు. ఆర్యన్ రాజేష్, ప్రశాంత్, స్నేహ కీలక పాత్రల్లో నటించారు. సంక్రాంతి బరిలో ఈ చిత్రం నిలవడంతో తొలిరోజు ఓపెనింగ్స్ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X