Ram Charan: బాబాయికి మద్దతుగా ప్రచారం చేయబోతున్న రామ్ చరణ్.. చెర్రీతో పాటు ఆమె కూడా!
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మరో మూడు రోజుల్లోనే ఉండడంతో అంతా అప్రమత్తం అయ్యారు. ముఖ్యంగా ప్రధాన పార్టీలు అయిన వైఎస్సార్ సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ 11వ తేదీనే ఎన్నికల ప్రచారాలకు చివరి రోజు కావడంతో.. క్షణం తీరిక లేకుండా ఉదయం నుంచి రాత్రి వరకు ప్రచారాలు, రోడ్ షోలు చేస్తూనే వస్తున్నారు. తమను గెలిపించమంటే తమనే గెలిపించమని ఓటర్లను అడుగుతూ.. రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా పోటీ చేస్తుండడంతో.. అనేక మంది సెలబ్రిటీలు రంగంలోకి దిగి ప్రచారాలు చేస్తున్నారు.
ముఖ్యంగా పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్న పవన్ కల్యాణ్ కు సపోర్టింగ్ గా.. అనేక మంది సెలబ్రిటీలు రోజుకొకరు ప్రచారం చేస్తున్నారు. మరికొందరేమో సామాజిక మాధ్యమాల వేదికగా పోస్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా మెగా పవర్ స్టార్ హీరో రామ్ చరణ్, ఆయన తల్లి సురేఖ కొణిదెలలు రేపు పవన్ కల్యాణ్ తరఫున పిఠాపురంలో పోటీ చేయబోతున్నారు. ఆ పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేయండి.

మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా ఎన్నికలకు రెండు రోజుల ముందే ప్రచారాన్ని నిలిపి వేయబోతుడడంతో.. రేపే ప్రచారానికి చివరి రోజు. అయితే ఈ ఒక్క రోజే ప్రచారానికి సమయం ఉండగా.. అంతా తమ ప్రచారాలను వేగవంతం చేశారు. పెద్ద పెద్ద నాయకులు సైతం ఏపీలో సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. రోడ్ షోలు చేస్తూ సందడి చేస్తున్నారు. ముఖ్యంగా జనసేనాని.. పవన్ కల్యాణ్ కు సపోర్టింగ్ గా అనేక మంది సినీ సెలబ్రిటీలు రంగంలోకి దిగారు.
పవన్ కల్యాణ్ పోటీ చేయబోతున్న పిఠాపురంలో మరింత వేడి రాజుకుంది. అనేక మంది సెలబ్రిటీలు అక్కడే ప్రచారం చేస్తుండగా.. రేపు మరో గ్లోబల్ స్టార్ అక్కడ పోటీ చేయబోతున్నారు. బాబాయి పవన్ కల్యాణ్ కు సపోర్టింగ్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. రంగంలోకి దిగబోతున్నారు. మే11వ తేదీ అంటే రేపు ఉదయమే ఆయన పిఠాపురంలో ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. ఆయన మాత్రమే కాకుండా.. ఆయన తల్లి సురేఖ కొణిదెల కూడా ఈ ప్రచారంలో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.

మే 11వ తేదీ ఉదయం 9.30 నిమిషాలకు తల్లి సురేఖతో కలిసి హీరో రామ్ చరణ్.. ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. ముందుగా పిఠాపురంలోని శ్రీ కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాతే ఎన్నికల ప్రచారం సాగబోతుంది. పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేయండి.


Click it and Unblock the Notifications











