twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR లో ఆ ఒక్క సీన్ చాలు.. ఫ్యాన్స్ ఇద్దరు భుజాన చేయి వేసుకొని వెళ్ళడానికి...

    |

    టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ త్రిబుల్ ఆర్ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెగా నందమూరి హీరోలు మొదటిసారి కలిసి నటించడం మేజర్ ప్లస్ పాయింట్. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన క్యారెక్టర్ ను నిజజీవితంలోని ఫ్రీడమ్ ఫైటర్స్ నుంచి స్ఫూర్తిగా తీసు కోవడం ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. ఇక మొత్తానికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదలవ్వగా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాను ఇరువురు అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ప్రశ్న ఇంకా తలెత్తుతూనే ఉండగా ఈ సినిమాలో ఒక సీన్ చూసిన తరువాత ఇద్దరూ అభిమానులు కూడా థియేటర్స్ నుంచే భుజాలు చేతులు వేసుకుని వెళ్లడం ఖాయం అని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

    ఫ్యాన్స్ మధ్య అప్పటి నుంచే..

    ఫ్యాన్స్ మధ్య అప్పటి నుంచే..

    మెగా నందమూరి అభిమానుల మధ్య కొట్లాటలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి ఇద్దరిమధ్య అప్పట్లో బాక్సాఫీస్ పోటీ అయితే తీవ్ర స్థాయిలో ఉండేది. హీరోలు ఆ విషయం ఎంతవరకు తీసుకునేవారు తెలియదుగానీ అభిమానులు మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునేవారు.

     అతిపెద్ద సవాల్

    అతిపెద్ద సవాల్


    ఎదురెదురుగా థియేటర్ లో హీరోల సినిమాలు ఉంటే మాత్రం అందులో వారి అభిమాన హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్స్ ను అయితే పోటాపోటీగా ముస్తాబు చేయడానికి ఇరు వర్గాల అభిమానులు పోటీ పడేవారు. ఇక సెలబ్రేషన్స్ చేయడంలో అయితే నిత్యం ఏదో ఒక పోటీ కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి వాతావరణం కొనసాగుతున్న సమయంలో రాజమౌళి ఇరు కుటుంబాల నుంచి ఇద్దరు హీరోలతో కలిసి సినిమా తీయడం పెద్ద సవాల్ అని చెప్పాలి.

    సోషల్ మీడియాలో

    సోషల్ మీడియాలో


    ఇక కథ పర్ఫెక్ట్ గా ఉంటే ఎలాంటి ప్రేక్షకుడు అయినా సరే అలాంటి ఆలోచన లేకుండా చూస్తాడు అని ఒక నమ్మకం తో రాజమౌళి RRR సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఇక ఈ సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో చాలా వరకు ఇరువర్గాలు అభిమానుల మధ్య కొంత మాటల యుద్ధం కొనసాగింది.

    టిక్కెట్లు చించేసిన ఫ్యాన్స్

    టిక్కెట్లు చించేసిన ఫ్యాన్స్


    ఇటీవల కుప్పంలో కూడా సినిమా టికెట్ల విషయంలో కూడా ఇరు వర్గాల అభిమానుల మధ్య వాదోపవాదాలు నిలిచాయి. స్పెషల్ షో టికెట్లపై ఓ వర్గం అభిమానుల సంఘం ప్రెసిడెంట్ ఫోటోలు ఉన్నాయి అని ఆగ్రహం వ్యక్తం చేసిన మరొక హీరో అభిమానులు వాటిని చించేసి థియేటర్ ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. మరో టికెట్స్ ప్రింట్ చేసి ఇవ్వాలి అని ధర్నా చేశారు.

    అలా కలిసిపోతారు..

    అలా కలిసిపోతారు..


    ఇక ఇరు వర్గాల అభిమానుల మధ్య ఈ తరహాలో పోట్లాటలో కొట్లాటలు జరుగుతూ ఉన్నప్పటికీ సినిమా విడుదలైన తర్వాత ఎలా రిసీవ్ చేసుకుంటారో అనేది కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ప్రస్తుతం సినిమాలో ఒక సీన్ చూస్తే మాత్రం ఇరువర్గాల అభిమానులు ఒకరిపై మరొకరు చేయి వేసుకుని సినిమా చూసిన అనంతరం థియేటర్ బయటకు వెళ్తారు అని మరికొంతమంది అభిమానులు చెబుతున్నారు.

    Recommended Video

    RRR Review: NTR, Ram Charan కెరీర్‌లో ది బెస్ట్ SS Rajamouli అంకితభావం | Filmibeat Telugu
    అన్న కోసం వెళ్లాల్సింది లక్ష్మణుడు

    అన్న కోసం వెళ్లాల్సింది లక్ష్మణుడు


    ముఖ్యంగా బ్రిడ్జ్ సీన్లో దోస్తీ సాంగ్ కి పడిపోవడం ఈజీ అని అంతకు ముందు వరకు ఏం జరిగింది అనే విషయాన్ని పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ను బ్రిటిష్ వారి నుంచి కాపాడేందుకు వెళ్లిన సీన్ కూడా అద్భుతంగా వర్కవుట్ అయినట్లు చెబుతున్నారు. సీతారామరాజు భార్య సీత ఆలియాభట్ జూనియర్ ఎన్టీఆర్ కు అన్నం పెట్టి తన బాధ చెప్పుకున్నప్పుడు.. అన్న కోసం వెళ్లాల్సిందే సీతమ్మ కాదు. లక్ష్మణుడు అంటూ ఎన్టీఆర్ యుద్ధానికి సిద్ధం అవ్వడం ప్రేక్షకులకు ఎంతగానో గర్వంగా ఫీల్ అయ్యేలా చేసినట్లు చెబుతున్నారు. ఈ రెండు మూడు సీట్లతోనే మెగా నందమూరి అభిమానులు కలిసిపోవడం ఖాయం అని అంటున్నారు.

    English summary
    Ram charan and ntr fans happy on RRR movie major emotional scenes
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X