Don't Miss!
- News హైదరాబాదు వాసులకు కూల్ న్యూస్.. పలు జిల్లాల్లో మూడ్రోజుల పాటు వర్షాలు..!
- Sports ఛాంపియన్‌లా వస్తున్నాం.. ఇది ఆరంభం మాత్రమే - పంత్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
RRR సెట్స్ నుంచి వీడియో లీక్.. ఒకే స్కూటర్‌పై.. ఎన్టీఆర్, రాంచరణ్ ఫ్యాన్స్ ఫిదా!
మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ జోరందుకుంది. ఇటీవల చిత్ర యూనిట్ గుజరాత్‌లోని వడోదరకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ చిత్ర తదుపరి షెడ్యూల్స్ ఎక్కువగా నార్త్ ఇండియాలో జరగనున్నాయి. పూణే, వడోదర, కోల్ కతా లాంటి నగరాల్లో చరణ్, ఎన్టీఆర్ పై రాజమౌళి కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో, రాంచరణ్ అల్లూరి సీతా రామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా షూటింగ్ లొకేషన్ నుంచి లీకైన చరణ్, ఎన్టీఆర్ వీడియో ఒకటి అభిమానులని ఫిదా చేస్తోంది.
ఒకే స్కూటర్‌పై
రాంచరణ్, ఎన్టీఆర్ మంచి స్నేహితులు అనే విషయం అందరికి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ చిత్రంతో వీరి మధ్య బంధం మరింతగా పెరుగుతున్నట్లు అనిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ షూటింగ్ లొకేషన్ నుంచి లీకైన ఓ వీడియోలో సోషల్ మీడియాలో సునామీలా వ్యాపిస్తోంది. రాంచరణ్ స్కూటీపై మంచి డ్రెస్ వేసుకుని కనిపిస్తున్నాడు. స్కూటిలో ఎన్టీఆర్ ఉన్న క్యారవాన్ వద్దకు వచ్చి ఆగుతాడు. అప్పుడే క్యారవాన్ నుంచి బయటకు వచ్చిన ఎన్టీఆర్ రాంచరణ్ ఉన్న స్కూటీ ఎక్కి స్వయంగా డ్రైవ్ చేస్తాడు. చరణ్, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున ఈ వీడియోని షేర్ చేస్తున్నారు.
అన్నదమ్ములు అంటూ
రాంచరణ్, ఎన్టీఆర్ స్కూటర్ పై వెళుతున్న వీడియో చరణ్, ఎన్టీఆర్ అభిమానులని ఫిదా చేస్తోంది. కొందరు నెటిజన్లు అయితే వేరు వేరు తల్లులకు పుట్టిన అన్నదమ్ములు వీళ్ళు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కొన్ని రోజుల క్రితం తాము ఆర్ఆర్ఆర్ షూటింగ్ కోసం వడోదర వెళుతున్నామని ఎన్టీఆర్ సోషల్ మీడియాలో తెలిపాడు. ఫ్లైట్ టికెట్స్ ని కూడా పోస్ట్ చేశాడు. అక్కడ షూటింగ్ జరుగుతుండగా సెట్స్ నుంచి ఈ వీడియో లీక్ అయింది.
చరణ్, ఎన్టీఆర్ స్నేహం
రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి మీడియాలో సమావేశంలో కొన్ని రోజుల క్రితం ఆసక్తికర విషయాలు తెలిపారు. ఆ మీడియా సమావేశంలో ఎన్టీఆర్, చరణ్ తమ మధ్య ఉన్న స్నేహం గురించి వివరించిన సంగతి తెలిసిందే. రాజమౌళి ఈ చిత్రం గురించి చెప్పగానే తాను, తారక్ ఎంతో సంతోషించామని రాంచరణ్ తెలిపాడు.
|
1920 కాలంలో
అల్లూరి సీతారామరాజు, కొమరం భీం దాదాపుగా ఒకే కాలానికి చెందినవారు. వీరిద్దరూ యుక్తవయసులో ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఆ సమయంలో వారిద్దరూ స్నేహితులై ఉంటే ఏం జరిగుండేది అనే ఊహాజనితమైన కాన్సెప్ట్ తో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలియా భట్, డైసీ ఎడ్గార్ జోన్స్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని డివివి దానయ్య 400 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్నారు.