శర్వానంద్ రణరంగంపై ప్రభాస్, రామ్ చరణ్ రియాక్షన్

యంగ్ హీరో శర్వానంద్ నటించిన తాజా చిత్రం 'రణరంగం'. 1980 - 90 దశకాలకు సంబంధించిన కథతో రూపొందిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకొని ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన విడుదలకు సిద్ధమైంది.

ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో శర్వానంద్‌ని సరికొత్త యాంగిల్‌లో చూపించారు. ముఖ్యంగా అతడి హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా ఈ సినిమా ఉందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. 1980 కాలం నాటి పరిస్థితులు, నేటి పరిస్థితులను కలుపుతూ ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.

Ram Charan and Prabhas Responce On Ranarangam

ప్రస్తుతం రణరంగం ట్రైలర్ సోషల్ మీడియాలో వేగంగా వ్యూస్ రాబడుతూ భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఇక తాజాగా రణరంగం ట్రైలర్ పై మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశంసలు కురిపిస్తూ పోస్టులు పెట్టారు. ట్రైలర్ చాలా ఉత్కంఠ భరితంగా ఉంది, శర్వానంద్ యాక్టింగ్ సూపర్.. రణరంగం చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అని రామ్ చరణ్ తెలపగా.. డార్లింగ్ శర్వానంద్, రణరంగం చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ అని ప్రభాస్ పేర్కొన్నాడు.

సుదీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'రణరంగం' చిత్రానికి నాగ వంశీ నిర్మాతగా వ్యవహరించాడు. చిత్రంలో శర్వానంద్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించాడు. విలక్షణ కథాంశంతో తెరకెక్కిన ఈ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X