Mega Princess: చిరంజీవి ఫ్యామిలీలో అలాంటి సెంటిమెంట్.. ముగ్గురు పిల్లలకూ ఒకేలా.. తెరపైకి కొత్త చర్చ
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీనికి కారణం ఆ కుటుంబం నుంచి మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఎంతో మంది కురాళ్లు హీరోలుగా రావడంతో పాటు స్టార్లుగా హవాను చూపిస్తుండడమే. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. చిరు వారసుడిగా పరిచయమై.. ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా హవాను చూపిస్తున్నాడు. దీంతో అతడి కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది. ఈ పరిస్థితుల్లో తాజాగా చరణ్ తండ్రి అయ్యాడు. దీంతో సినీ వర్గాల్లో చిరంజీవి ఫ్యామిలీ గురించిన చర్చ ఒకటి తెరపైకి వచ్చింది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి!
చరణ్, ఉపాసనకు పాప:మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. ఈ జంటకు మంగళవారం తెల్లవారుజామున ఓ పండంటి పాప జన్మించింది. వాస్తవానికి డాక్టర్లు ఇచ్చిన డేట్ ప్రకారం.. ఉపాసన సోమవారం రాత్రే అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ క్రమంలోనే రాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆమె నార్మల్ డెలివరీ ద్వారా పాపకు జన్మనిచ్చారు.

శుభాకాంక్షలు వెల్లువలా:రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పాప జన్మించడంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు మిన్నంటాయి. డెలివరీ అయిన వెంటనే చిరంజీవి దంపతులు తమ మనవరాలిని చూసేందుకు అపోలో ఆస్పత్రికి వచ్చారు. మళ్లీ కాసేపట్లో ఆస్పత్రికి రాబోతున్నారు. ఇక, మెగా ప్రిన్సెస్ రాకతో అభిమానులు, సెలెబ్రిటీల నుంచి చరణ్ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.
ఫ్యామిలీ సెంటిమెంట్:మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు పాప జన్మించడంతో సంబరాలు అంబరాన్ని అంటాయి. అదే సమయంలో దీనిపై సరికొత్త, ఊహించని చర్చ ఒకటి తెరపైకి వచ్చింది. అదేమిటంటే చిరంజీవి ఫ్యామిలీలో ఇప్పటి వరకూ జరిగిన డెలివరీలు అన్నింటిలోనూ ఆడ పిల్లలే జన్మించారట. ఇప్పుడు చరణ్ దంపతులకు పుట్టిన పాపతో కలిపి మొత్తం చిరంజీవికి ఐదుగురు మనవరాళ్లు వచ్చారు.

సుస్మితకు ఇద్దరు గర్ల్స్:మెగాస్టార్ చిరంజీవికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్న విషయం తెలిసిందే. అందులో అందరి కంటే పెద్ద అయిన సుస్మిత కొణిదెల.. విష్ణు ప్రసాద్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు పాపలు జన్మించారు. అందులో ఒక అమ్మాయికి సమర అని, ఇంకో పాపకు సంహిత అని పేర్లు పెట్టారు. వీళ్లు తరచూ తన తాత మెగాస్టార్ చిరంజీవితో ఎంజాయ్ చేస్తుంటారు.

శ్రీజాకు ఇద్దరు పాపలు:చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజకు రెండు వివాహాలు జరిగిన విషయం తెలిసిందే. మొదట్లో ఆమె ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు నివ్రతి అనే పాప జన్మించింది. ఇక, కల్యాణ్ దేవ్‌తో వివాహం తర్వాత శ్రీజకు నివిక్ష అనే ఆడ పిల్ల పుట్టింది. వీళ్లు ప్రస్తుతం చిరంజీవి ఇంట్లోనే ఉంటున్నారు. ఇలా చిరంజీవి ఇద్దరు అమ్మాయిలకు ఇద్దరేసి పాపలు (మొత్తం నలుగురు) జన్మించారు.

వారసుడి కోసం ఫ్యాన్స్:చిరంజీవి ఇద్దరు అమ్మాయిలకు పాపలే జన్మించడంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు అయినా వారసుడు పుడతాడని ఫ్యాన్స్ అనుకున్నారు. ఈ మేరకు ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచే ఆమెకు బాబు పుట్టాలని అభిమానులంతా కోరుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టారు. అయితే, ఇప్పుడు ఉపాసనకు కూడా పాపే జన్మించింది.

అదే సంతోషం అనాలి:పాప పుట్టిందా? వారసుడు వచ్చాడా? అన్నది పక్కన పెడితే.. ఉపాసన డెలివరీ సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. తల్లి పిల్ల ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. దీంతో అటు మెగా ఫ్యామిలీ వాళ్లు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ సంతోషంగా ఉన్నారు. చాలా మంది నెటిజన్లు కూడా ఇదే విషయంలో సంతోషం వ్యక్తం చేస్తూ పోస్టులు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











