twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీరంతా బాబాయ్ కి అండగా ఉండండి: రామ్ చరణ్ తన సపోర్ట్ ఎవరికో చెప్పేసాడు

    'మీరందరూ బాబాయ్ కి అండగా ఉండండి. రాజకీయం అయినా.. మరెందులో అయినా.. మీ అందరి మద్దతు బాబాయ్ కి ఉండాలి' అంటూ చెర్రీ చేసిన కామెంట్స్ ఆసక్తి కలిగిస్తున్నాయి.

    |

    బ్రదర్స్ చిరు, పవన్ కళ్యాణ్ ల మధ్య బిగ్ ఫైట్ నడుస్తుందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతూనే ఉంది.కొన్నేళ్ళుగా మెగా బేదర్స్ మధ్య విభేదాలున్నాయన్న మాట ఇప్పటి వరకూ ఓపెన్ సీక్రేట్ గా నే ఉండిపోయింది. అదపాదడపా అన్నదమ్ములిద్దరూ కలిసి పోతున్నట్టే కనిపించినా దూరం దూరం గానే ఉండిపోయింది.

    గౌరవం ఇస్తూనే

    గౌరవం ఇస్తూనే

    చిరు కి తగినంత గౌరవం ఇస్తూనే రాజకీయంగా చిరు తో వ్యతిరేకిస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్. అలాగే చిరు కూడా నా తమ్ముడూ నా తమ్ముడూ అంటూనే అవసరమైనప్పుడు మాత్రం చురకలు అంటిస్తూ ఉంటాడు. వారిద్దరి మధ్యనా అభిప్రాయ బేదాలు అయితే ఉన్నాయి కానీ గొడవలు మాత్రం ఎక్కడా లేవు. చిరు గురించి పవన్ ని అడిగినా పవన్ గురించి చిరు దగ్గర ప్రస్తావన తీసుకుని వచ్చినా వారిద్దరికీ గొడవలేమీ లేవు అని అర్ధం అయిపోతూ ఉంటుంది.

    జనసేన తర్వాత

    జనసేన తర్వాత

    అయితే జనసేన తర్వాత మరింతగా దూరం పాటిస్తూనే ఉన్నారు. ఫ్యామిలీ విషయంలో ఎంత దగ్గరైనా రాజకీయాల్లో మాత్రం ఇంకా ఎలక్షన్ లు రాకపోయినప్పటికీ ప్రత్యర్తులు మాదిరిగానే అనుకుంటున్నారేమో ఈ ఇద్దరు అన్నదమ్ములూ బయట ఎక్కడా కలవటం లేదు.

    మెగా ఫంక్షన్లన్నిటినీ అవాయిడ్ చేస్తూ

    మెగా ఫంక్షన్లన్నిటినీ అవాయిడ్ చేస్తూ

    దాదాపుగా మెగా ఫంక్షన్లన్నిటినీ అవాయిడ్ చేస్తూ వస్తున్నాడు పవన్.. అయితే ఇవన్నీ ఎలా ఉన్నా చిన్నప్పటినుంచీ రామ్ చరణ్, పవన్ ఇద్దరి మధ్యా మంచి అనుబందం ఉందన్నది తెలిసిందే కదా. అయితే ఇప్పుడంత బాండ్ ఏమీ లేదనీ ఖైదీ నంబర్ 150 మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి బాబాయ్ పవన్ కళ్యాణ్ రాలేదని.. అబ్బాయ్ రామ్ చరణ్ అలిగాడని కూడా అంటారు.

    రూమర్స్

    రూమర్స్

    ఇలాంటివన్నీ రూమర్స్ అని ఎన్ని సార్లు చెప్పినా మళ్లీ కొత్తగా ఇంకోటి పుడుతూనే ఉంటుంది. ఖైదీ ప్రీ రిలీజ్‌కు పవర్‌స్టార్ వస్తున్నారా? అని ఈ సందర్భంగా ఓ అభిమాని ప్రశ్నించగా.. ‘‘ఇదొక బిగ్ క్వశన్. ఆయనను కలవడానికి ఇవాళ నేను వెళుతున్నాను. మీకు ఇంతకు ముందే చెప్పాను..

    చెర్రీ కూడా పవన్ కి దూరమయ్యాడనీ

    చెర్రీ కూడా పవన్ కి దూరమయ్యాడనీ

    పిలవడానికి ఆయనేం చిన్నపిల్లాడు కాదు. ఇన్విటేషన్ ఇవ్వడం వరకే మన బాధ్యత. ఆయనకు ఇన్విటేషన్ ఇస్తాం. రావాలా, వద్దా అనేది ఆయనే డిసైడ్ చేసుకుంటారు.'' అని చరణ్ సమాధానమిచ్చాడు. అంతే ఇక మెగా ఫ్యామిలీ లో ఇంకా గొడవలున్నాయనీ, చెర్రీ కూడా పవన్ కి దూరమయ్యాడనీ చెప్పుకోవటం మొదలయ్యింది.

    చెప్పను బ్రదర్

    చెప్పను బ్రదర్

    దానికి ముందే అల్లు అర్జున్ "చెప్పను బ్రదర్" కాంట్రవర్సీ కూడా ఉండటం తో అంతా కలిసి పవన్ ని దూరం పెట్టారంటూ వార్తలు ప్రచారం అయ్యాయి. కానీ అదేమీ లేదనీ తాము ఎప్పటికీ కలిసే ఉంటాం అని చెప్పకనే చెప్పాడు చరణ్ ఇంతకీ ఎలా అంటే....

    బాబాయ్ కి అండగా ఉండండి

    బాబాయ్ కి అండగా ఉండండి

    ప్రస్తుతం గోదావరి జిల్లాలో షూటింగ్ జరుపుతున్న రామ్ చరణ్.. అభిమానులతో రోజూ ముచ్చటిస్తున్నాడు. ఓ సందర్భంలో నేరుగా కాకపోయినా రాజకీయాలపై కూడా మాట్లాడేశాడు. 'మీరందరూ బాబాయ్ కి అండగా ఉండండి. రాజకీయం అయినా.. మరెందులో అయినా.. మీ అందరి మద్దతు బాబాయ్ కి ఉండాలి' అంటూ చెర్రీ చేసిన కామెంట్స్ ఆసక్తి కలిగిస్తున్నాయి.

    చిరంజీవికే చరణ్ సపోర్ట్

    చిరంజీవికే చరణ్ సపోర్ట్

    అందరినీ అలర్ట్ చేశాయి. ఇప్పటివరకూ రాజకీయంగా అయితే తండ్రి చిరంజీవికే రామ్ చరణ్ సపోర్ట్ ఉంటుందని అంతా భావించారు. కాంగ్రెస్ లో ఉన్న చిరుకు చెర్రీ మద్దతు ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ చెర్రీ మాత్రం జనసేనకీ బాబాయ్ కీ తన మద్దతు ఉంటుందని తెలియజేసాడు.

    చెర్రీ జనసేనానికే మద్దతు

    చెర్రీ జనసేనానికే మద్దతు

    ఇవే మాటలు లోకల్ కాంగ్రేస్ నాయకులకూ మింగుడు పడని విధంగా తయారయ్యాయి. ఇప్పటికే పవన్ ప్రభావం కాంగ్రేస్ సీట్లమీద బలంగా పడే అవకాశం ఉంటే ఇప్పుడు చెర్రీ కూడా జనసేనానికే తన మద్దతు అన్నట్టు మాట్లాడటం వాళ్ళకి కాస్త మంటగానే ఉండి ఉంటుంది మరి.

    English summary
    Ram Chara called for all mega fans to support his babai. "Whichever the program is initiated by babai including politics or any other activity, fans should support him," Said Ram Charan
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X