రామ్ చరణ్ తేజా 'వేరు కుంపటి'??
ఇప్పటి వరకూ చిరంజీవి కుటుంబానికి సంబంధించి రెండు నిర్మాణ సంస్థలు వున్నాయి. అవి అల్లు అరవింద్ కు చెందిన 'గీతా ఆర్ట్స్ బ్యానర్' ఒకటి, మరొకటి నాగబాబుకు సంబంధించిన 'అంజనా ప్రొడక్షన్స్'. కానీ తమకంటూ ఓ బ్యానర్ వుండాలని చరణ్ అనుకున్నాడో ఏమో తాజాగా తన సినిమాను తానే నిర్మించుకుంటూ నిర్మాతగా కొత్త అవతారం ఎత్తబోతున్నాడని సమాచారం.
'మగధీర' చిత్రం ఘనవిజయం తర్వాత రామ్ చరణ్ నటించబోతున్న 'బొమ్మరిల్లు' భాస్కర్ చిత్రాన్ని తొలుత 'అంజనా ప్రొడక్షన్స్' పై నిర్మించబోతున్నారని తెలిసినప్పటికీ తాజా సమాచారం ప్రకారం రామ్ చరణే ఓ నిర్మాణ సంస్థను స్థాపించి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడని తెలిసింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ ద్విభాషా చిత్రంలో జెనీలియా కథానాయికగా నటించనుంది. ఇప్పుడున్న నవతరం హీరోల్లో కళ్యాణ్ రామ్ కూడా ఇలాగే 'ఎన్టీఆర్ ఆర్ట్స్' బ్యానర్ పై చిత్రాలు నిర్మిస్తూ సక్సెను పొందాడు. మరి హీరోగా గ్రాండ్ సక్సెస్ ను అనుభవిస్తున్న చరణ్ నిర్మాతగా ఏ మేరకు సఫలీకృతుడవుతాడో చూడాలి. ఆల్ ద బెస్ట్ చరణ్.


Click it and Unblock the Notifications











