కరోనాను వెనక్కి నెట్టేసి మరీ.. రామ్ చరణ్ మామూలోడు కాదు.. సోషల్ మీడియాలో RRR హల్చల్

దేశంలో కరోనా తాండవం చేస్తున్న ఈ తరుణంలోనూ ఆర్ఆర్ఆర్ టీమ్ రచ్చ చేస్తోంది. నేడు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్బంగా రిలీజ్ చేసిన అల్లూరి సీతారామరాజు వీడియో, రామ్ చరణ్ లుక్, ఎన్టీఆర్ వాయిస్ ఇలా ప్రతీ ఒక్కటి దుమ్ములేపుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ చేసే రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

ఎన్టీఆర్ డైలాగ్స్ కేక..

ఎన్టీఆర్ తెలంగాణ యాసలో అల్లూరి గురించి చెప్పిన డైలాగ్స్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. కనబడితే నిప్పుకణం నిలబడినట్టు ఉంటది.. కలబడితే వేగుచుక్క ఎగబడినట్టు ఉంటది.. ఎదురుపడితే సావుకైనా చెమట దారపడతి.. బాణమైనా బంధూకైనా వానికి బాంచన్ అయితది.. ఇంటి పేరు అల్లూరి సాకింది గోదారి.. నా అన్న మన్నెం దొర.. అనే మాటలు మార్మోగిపోతున్నాయి.

ప్రత్యేకంగా నిలిచిన రామ్ చరణ్

ప్రత్యేకంగా నిలిచిన రామ్ చరణ్

ఎన్టీఆర్ వాయిస్ ఓవర్స్‌లో ఒక్కో డైలాగ్ అలా వినిపిస్తు ఉంటే.. దానికి ప్రతిరూపంగా రామ్ చరణ్‌ను చూపించడం, అల్లూరి పాత్రలో రామ్ చరణ్ పూర్తిగా పరకాయ ప్రవేశం చేసినట్టు అనిపిస్తుంది. బాణం ఎక్కుపెట్టే తీరు..కర్రతిప్పే స్టైల్, గన్ పేల్చే విధానం ఇలా అన్నింటిలోనూ ప్రత్యేకంగా కనిపించాడు. ముఖ్యంగా శరీరాకృతి హైలెట్‌గా నిలిచింది.

భీమ్ గొంతులో రామ్..

భీమ్ గొంతులో రామ్..

భీమ్ గొంతులో రామ్ కనిపిస్తే.. రామ్ ఆకృతిలో భీమ్ కనిపించాడు. రామ్ చరణ్ ప్రత్యేకంగా తీసుకున్న శిక్షణ తాలుకూ శ్రమ ఇప్పుడు కనిపిస్తోంది. అల్లూరి పాత్రలో రామ్ చరణ్ తప్ప మరెవర్నీ ఊహించలేకుండా జీవించేశాడు. ఇక ఈ వీడియో యూట్యూబ్‌లో ఎన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.

Recommended Video

Bheem For Ramaraju - RRR| Ram Charan’s First Look Video On His Birthday
కరోనాను నెట్టేసి మరీ..

కరోనాను నెట్టేసి మరీ..

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ అనేది ఎంతటి హాట్ టాపిక్‌గా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి టాపిక్‌ను ఆర్ఆర్ఆర్ వెనక్కి నెట్టేసింది. ప్రస్తుతం రామరాజు కోసం భీమ్ అనే టాపిక్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులంతా ఈ వీడియోపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X