»   » చిట్టి చెల్లిని తమ రేంజికి తెచ్చేందుకు.. రామ్ చరణ్ ప్రయత్నం!

చిట్టి చెల్లిని తమ రేంజికి తెచ్చేందుకు.. రామ్ చరణ్ ప్రయత్నం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ చిట్టి చెల్లి.... నిహారిక త్వరలో 'ఒక మనసు' చిత్రం ద్వారా హీరోయిన్‌గా తెరంగ్రేటం చేయబోతున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న తొలి హీరోయిన్ నిహారిక. నాగశౌర్య, నిహారిక జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్స్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. రామ్ చరణ్‌కు కూడా ఈ సినిమా ప్రోమోలు బాగా నచ్చాయి.

సాధారణంగా మెగా ఫ్యామిలీ నుండి ఎవరైనా కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారంటే.... వారికి మెగా అభిమానులు నుండి మద్దతు ఉండటంతో పాటు అప్పటికే ఇండస్ట్రీలో సెటిలైన మెగా హీరోల నుండి ప్రోత్సహం ఉంటుంది. వారి సినిమా పంక్షన్లకు హాజరవ్వడం ద్వారా సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తుంటారు.

నిహారిక విషయంలో రామ్ చరణ్ స్వయంగా బాధ్యత తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అందుకే నిహారిక నిటిస్తున్న 'ఒక మనసు' చిత్రం ప్రమోషన్స్‌లో రామ్ చరణ్ పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. తన సోషల్ మీడియా ద్వారా 'ఒక మనసు' చిత్రాన్ని ప్రమోట్ చేయడంతో పాటు, మూవీ ఆడియో వేడుకకు కూడా హాజరయ్యేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం.

నిహారిక నటిస్తున్న 'ఒక మనసు' మూవీ వివరాల్లోకి వెళితే రామరాజు ఈ చిత్రానికి దర్శకుడు. మధుర శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న తొలి హీరోయిన్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రానికి సూపర్ క్రేజ్ వచ్చింది. మరో వైపు నిహారిక ముద్దపప్పు ఆవకాయ్ తో యాక్టింగ్ టాలెంట్ పరంగా తానేంటో నిరూపించుకుంది. వెబ్ సిరీస్ లో అదరగొట్టిన నిహారిక సినిమాలో మరింత ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.

నిహారిక

నిహారిక

హెల్తీ ఎంటర్టెన్మెంట్ సబ్జెక్టుతో ఫీల్ గుడ్ గా ఈ సినిమా ఉంటుందని, మెగా ఫ్యామిలీ ఇమేజ్ ఏమాత్రం డ్యామేజ్ కాకుండా, నటిగా నిహారికకు మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఉంటుందని అంటున్నారు.

ఒక మనసు

ఒక మనసు

మధుర శ్రీధర్, టీవీ 9 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

అంచనాలు..

అంచనాలు..

ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై అంచనాలు పెరిగాయి.

కెమిస్ట్రీ

కెమిస్ట్రీ

నిహారిక, నాగ శౌర్య మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అందరూ మెచ్చే విధంగా ఫ్యామిలీ ఎంటర్టెనర్ లా ఈ సినిమా ఉండబోతోంది.

English summary
Film Nagar source said that, Ram Charan as Chief Guest for Oka Manasu Audio Launch.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu