రామ్ చరణ్ తో అశ్వనీదత్ ఖరారు...డిటేల్స్

By Srikanya

రామ్ చరణ్ తేజను 'చిరుత'గా పరిశ్రమకు పరిచయం చేసిన నిర్మాత అశ్వనీదత్. ఎన్టీఆర్ తో చేసిన శక్తి చిత్రం డిజాస్టర్ కావటంతో నిరాశలో ఉన్న ఆయన మళ్లీ తన వైభవాన్ని పొందటానికి రామ్ చరణ్ తో చిత్రం నిర్మించటానికి కమిటయ్యారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం అక్టోబరులో ప్రారంభం కానుంది. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ...''రామ్‌చరణ్‌ హీరోగా సినిమా నిర్మిస్తుండటం ఆనందంగా ఉంది. 'చిరుత' చిత్రంతో మా సంస్థ నుంచే ఆయన తెరంగేట్రం చేశారు. మరోసారి చరణ్‌తో సినిమా తెరకెక్కిస్తుండటం సంతోషంగా ఉంది. చరణ్‌ శైలిలోని మాస్‌ అంశాలతో పాటు, శ్రీనువైట్ల తరహా వినోదమంతా ఇందులో ఉండబోతోంది.

అలాగే మహేష్‌బాబు-క్రిష్‌ కలయికలో తెరకెక్కనున్న చిత్రం ఆగస్టులో ప్రారంభమవుతుంది అన్నారు. ఇక గతంలో 'రాజకుమారుడు'తో మహేష్‌బాబును, 'చిరుత'తో రామ్‌చరణ్‌ను హీరోలుగా పరిచయం చేసిన అశ్వనీదత్ ఒకే ఏడాది ఈ ఇద్దరు అగ్ర హీరోలతో సినిమాలు నిర్మిస్తుండడంతో అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ తాజా చిత్రం చరణ్ ఇమేజ్‌కి తగ్గట్టుగా, శ్రీనువైట్ల శైలిలో సరదాగా సాగిపోయే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X