వైరల్ అవుతున్న బన్నీ, రాంచరణ్ వీడియో.. బర్త్‌డే పార్టీలో ఒకరికొకరు!

Recommended Video

Ram Charan At Allu Arjun's Birthday Party, Video Goes Viral | #HBDALLUARJUN || Filmibeat Telugu

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అల్లు అర్జున్ నేటితో 36వ పడిలోకి అడుగుపెట్టాడు. సినీ ప్రముఖులు, అభిమానులు బన్నీకి సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అల్లు అర్జున్ పుట్టినరోజు పురస్కరించుకుని కొత్త చిత్రాల గురించి ఆసక్తికర ప్రకటనలు కూడా వచ్చాయి. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ బర్త్ డే పార్టీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా ఈ వీడియోలో కనిపిస్తున్నాడు.

బర్త్ డే పార్టీలో రాంచరణ్

బర్త్ డే పార్టీలో రాంచరణ్

అల్లు అర్జున్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. బన్నీ పుట్టినరోజు మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా పాల్గొన్నాడు. బన్నీకి రాంచరణ్ కేక్ తినిపిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ కూడా రాంచరణ్ కు తిరిగి కేక్ తినిపించడం, ఇద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం లాంటి దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి.

బ్లాక్ బస్టర్ ఇయర్ అంటూ

బ్లాక్ బస్టర్ ఇయర్ అంటూ

రాంచరణ్ సోషల్ మీడియా వేదికగా కూడా బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. అల్లు అర్జున్ కు జన్మదిన శుభాకాంక్షలు.. నీకు ఈ ఏడాది బ్లాక్ బస్టర్ ఇయర్ కావాలని ఆశిస్తున్నా అంటూ రాంచరణ్ పేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. మరోవైపు బన్నీ తన కుటుంబ సభ్యులు.. సతీమణి స్నేహ, తనయుడు అల్లు అయాన్, కుమార్తె అర్హతో కలసి కూడా తన పుట్టినరోజుని సెలెబ్రేట్ చేసుకున్నాడు.

పవన్‌ని పరామర్శించడానికి

పవన్‌ని పరామర్శించడానికి

ఇదిలా ఉండగా అల్లు అర్జున్ త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలవబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ ఇప్పటికే జనసేన పార్టీకి తన నైతిక మద్దత్తు ప్రకటించాడు. ఇటీవల పవన్ కళ్యాణ్ వడదెబ్బ కారణంగా అనారోగ్యానికి గురయ్యాడు. రాంచరణ్ పవన్ కళ్యాణ్ ని పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆశించాడు. త్వరలో అల్లు అర్జున్ కూడా పవన్ ని కలిసేందుకు వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వరుస చిత్రాలతో బిజీ

ఇక సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా తదుపరి చిత్రాల గురించి ఫుల్ క్లారిటీ వచ్చింది. ఈ ఏడాది బన్నీ మూడు చిత్రాల్లో నటించబోతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించేందుకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మరో చిత్రం ఉంటుంది. బన్నీ మరో క్రేజీ ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వేణు శ్రీరామ్ దర్శత్వంలో దిల్ రాజు నిర్మించే చిత్రానికి ఓకే చెప్పాడు. ఈ చిత్రాన్ని 'ఐకాన్ కనబడుటలేదు' అనే ఆసక్తికరమైన టైటిల్ కూడా ఖరారు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X