»   »  ఫేస్ బుక్ ఆఫీసులో రామ్ చరణ్ సందడి (ఫోటోస్)

ఫేస్ బుక్ ఆఫీసులో రామ్ చరణ్ సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వరుస షూటింగులతో అలసి పోయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన భార్య ఉపాసనతో కలిసి విదేశీ పర్యటనలో రిలాక్స్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్ యూఎస్ఏలో ఉన్నారు. ఇటీవల అక్కడ ఆధ్యాత్మిక గురు దీపక్ చోప్రాను కలిసిన చెర్రీ... తాజాగా శాన్ ఫ్రాన్సిసిస్కోలోని ఫేస్ బుక్ ఆఫీసును సందర్శించాడు.

అక్కడి తన అనుభవాలను రామ్ చరణ్ తన ఫేస్ బుక్ పేజీ ద్వారా వెల్లడించారు. ‘శాన్ ఫ్రాన్సిస్కోలోని ఫేస్ బుక్ ఆఫీసులో గడిపాను. ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉంది. థాంక్స్ య ఆల్ ఫర్ ది లవ్ అండ్ గిఫ్ట్స్. యూ గైస్ ఆర్ అమేజింగ్' అంటూ వెల్లడించారు.

చాలా కాలంగా రామ్ చరణ్ యూఎస్ఏ మార్కెట్లో నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తున్నాడు కానీ... ఆయన సినిమాలు అక్కడ పెద్దగా సక్సెస్ కావడం లేదు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉన్నంత క్రేజ్ అక్కడ రామ్ చరణ్ సినిమాలకు లేదు. ఇప్పటి వరకు చెర్రీ సినిమాలేవీ అక్కడ 1 మిలియన్ డాలర్ మార్కును అందుకోలేదు. హీరో నాని 1 మిలియన్ మార్కును అందుకున్నాడు. కానీ చెర్రీ మాత్రం ఈ విషయంలో వెనకే ఉన్నాడు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన యూఎస్ఏ పర్యటన చేస్తుండటం, అక్కడి ఎన్ఆర్ఐలను కలుస్తుండటం భవిష్యత్తులో తన సినిమాల ఆదరణ పెరగడానికి తోడ్పడుతుందని భావిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ట్రిప్ ద్వారా రామ్ చరణ్ హాలిడే ఎంజాయ్ చేయడంతో పాటు తన సినిమాల మార్కెట్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు.

ఫేస్ బుక్ ఆఫీసులో రామ్ చరణ్

ఫేస్ బుక్ ఆఫీసులో రామ్ చరణ్

ఫేస్ బుక్ ఆఫీసులోని ఉద్యోగులతో రామ్ చరణ్. థాంక్స్ య ఆల్ ఫర్ ది లవ్ అండ్ గిఫ్ట్స్. యూ గైస్ ఆర్ అమేజింగ్ అంటూ రామ్ చరణ్ పేర్కొన్నాడు.

శాన్ ఫ్రాన్సిసిస్కో

శాన్ ఫ్రాన్సిసిస్కో

శాన్ ఫ్రాన్సిస్కోలోని ఫేస్ బుక్ ఆఫీసులో గడిపాను. ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉందన్నారు చెర్రీ.

దీపావళి

దీపావళి

దీపావళి సందర్భంగా రామ్ చరణ్ యూఎస్ఏలో ఉన్నాడు. ఫేస్ బుక్ పేజీ ద్వారా ఇలా విషెస్ చెప్పాడు.

దీపక్ చోప్రా

దీపక్ చోప్రా

ఆధ్యాత్మిక గురు దీపక్ చోప్రాను కలిసిన రామ్ చరణ్

English summary
Ram Charan wrote: "Had Great time today at facebook office(San Francisco)interacting with everyone. Thanks you all for the love & gifts.you guys are Amazing!!!".
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu