twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీక్రెట్ గా ఆ 'షో'కు రామ్ చరణ్

    By Srikanya
    |

    యూత్ ఐకాన్ గా మారిన రామ్ చరణ్ అందుకు తగినట్లే తను వ్యవహరిస్తున్నారు.తాజాగా లేడి గాగా షోలో కూడా పాల్గొని హాట్ టాపిక్ గా మారారు.అయితే ఈ విషయాన్ని మీడియా వరకూ రానివ్వకుండా చూసారు.ఇంగ్లండ్‌కు చెందిన విర్జిన్‌ రేసింగ్‌ టీమ్‌ అధిపతి,బిజెనెస్ టైకూన్ రిచర్డ్‌ బ్రాస్నన్‌ కుమారుడు శామ్‌ బ్రాస్నన్‌ ఆహ్వానం మేరకు చరణ్‌ లేడి గాగా షోలో పాల్గొన్నాడు.అదే సమయంలో విర్జిన్‌ రేసింగ్‌ టీమ్‌కు మద్దతు తెలిపాడు.రామ్‌ చరణ్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ఫరమ్‌ నివియోకు చెందిన సచిన్‌ దుగ్గల్‌,ఎంజిఎం డిజిటల్‌ ప్రెసిడెంట్‌ రోమా ఖన్నా, అమెరికా నుంచి వచ్చిన ఇతర మ్యూజిక్‌ ప్రొడ్యూసర్లు ఈ సందర్భంగా కలుసుకున్నారు.లేడి గాగా షో జరిగినంతసేపూ వాళ్లు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసారు.ఇక ప్రస్తుతం రామ్ చరణ్ రచ్చ చిత్రంలో చేస్తున్నారు.ఈ చిత్రం నిమిత్తం రామ్ చరణ్ నవంబర్ 12 వ తేదీ న చైనా వెళ్లనున్నారు.అక్కడ ఓ అటవీ ప్రాంతంలో తాను చేస్తున్న రచ్చ షూటింగ్ కి సంభంధించి కొన్ని కీలక సన్నివేశాలు,ఫైట్స్ చిత్రీకరించనున్నారు.ప్రస్తుతం హైదరాబాద్ లో చరణ్,తమన్నాలపై ఓ సాంగ్ ని షూట్ చేస్తున్నారు.

    ఇక రచ్చ దర్శకుడు సంపత్ నంది గురించి చెపుతూ..నేను చాలా ఎగ్జైట్మెంట్ తో ఉన్నాను..అలాంటి పాత్రను నేను ఎప్పుడూ ఊహించుకోలేదు. నా ఫ్యాన్స్ నానుంచి ఎలాంటి సినిమా ఎక్సపెక్ట్ చేస్తారో ఖచ్చితంగా అలాంటిదే ఇది. ఈ స్క్రిప్టుని సంపత్ నంది చాలా జాగ్రత్తగా వర్క్ చేసి తెరకెక్కిస్తున్నారు. అతను చాలా ప్రతిభావంతంగా పనిచేస్తున్నాడు అన్నారు. ఇక రచ్చ చిత్రాన్ని క్రిసమస్ కానుకగా విడుదల చేయాలని రామ్ చరణ్ చెప్తున్నారు. పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంకోసం రామ్ చరణ్ మియామి, అమెరికలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తమన్నా రామ్ చరణ్ తో జోడికడుతున్న ఈ సినిమాలో చరణ్ మిడిల్ క్లాస్ కుర్రాడుగా పక్కా మాస్ పాత్రను చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ 'రచ్చ'సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తుంది.

    English summary
    Ram Charan was invited by Sam Branson (son of UK based business tycoon Richard Branson of virgin racing)to support the virgin racing team. He along with Sachin Duggal ( Nivio a cloud computing firm), Roma Khanna president of MGM digital out of LA and other music producers from the US were at their table.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X