వైష్ణవ్ తేజ్, బుచ్చిబాబుకు ఇంత అదృష్టమా? అందరికీ ఆ భయం.. ఉప్పెన సక్సెస్ మీట్‌లో రాంచరణ్

ఉప్పెన చిత్రం రిలీజై ప్రేక్షకుల నీరాజనాలు అందుకొంటున్నది. విడుదలైన అన్ని చోట్ల భారీగా కలెక్షన్లను వసూలు చేస్తున్న నేపథ్యంలో ఈ చిత్ర యూనిట్ రాజమండ్రిలో బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ జరిపారు. ఈ వేడుకలో మెగా పవర్ స్టార్ రాంచరణ్‌తోపాటు చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నది. ఈ సందర్భంగా రాంచరణ్ మాట్లాడుతూ..

Recommended Video

Uppena Success Meet: Ram Charan Praises Vaishnav tej performance | Oneindia telugu
సినీ పరిశ్రమ మూగపోయిన సమయంలో

సినీ పరిశ్రమ మూగపోయిన సమయంలో

కరోనా కారణంగా సినీ పరిశ్రమ మూగపోయింది. అనేక సమస్యల్లో కూరుకుపోయింది. లాక్‌డౌన్ ఎత్తివేసి థియేటర్లు ఓపెన్ చేసిన తర్వాత సినిమాలను రిలీజ్ చేయడానికి అందరూ భయపడ్డారు. కానీ తెలుగు సినీ పరిశ్రమ అందరికంటే తొందరగా రికవరీ అయింది. అందుకు కారణం ప్రేక్షకులే. మాకు ఎంతో ధైర్యం ఇచ్చిన ప్రేక్షకులకు రుణపడి ఉంటాం. తెలుగు సినిమాకు ప్రాణం పోశారు. ఇతర భాషల సినీ రంగాలకు భరోసా ఇచ్చారు అని రాంచరణ్ తెలిపారు.

మైత్రీ మూవీస్ ధైర్యంగా

మైత్రీ మూవీస్ ధైర్యంగా

ఉప్పెన లాంటి కథను ధైర్యంగా ఒప్పుకొని ప్రేక్షకుల వరకు తీసుకొచ్చిన మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మాతలకు ముందుగా ధన్యవాదాలు తెలిపాలి నా కెరీర్‌లో బ్లాక్ బస్టర్ ఇచ్చిన నిర్మాతలు వారే. ముగ్గురు కొత్తవాళ్లను పరిచయం చేస్తూ 30, 40 కోట్ల బడ్జెట్ పెట్టి ధైర్యం చేసిన నిర్మాతలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాం అని రాంచరణ్ అన్నారు.

దేవీ శ్రీ ప్రసాద్ బ్లాక్‌బస్టర్ మ్యూజిక్

దేవీ శ్రీ ప్రసాద్ బ్లాక్‌బస్టర్ మ్యూజిక్

ఉప్పెన సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్. నాకు అతి పెద్ద ఆల్బమ్ ఇచ్చారు. ఇప్పుడు మా వైష్ణవ్ తేజ్‌కు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. అలాంటి అవకాశం వైష్ణవ్ తేజ్ లభించడం గర్వంగా ఉంది. సెకండాఫ్‌లో పడవపై తీసిన సాంగ్ నాకు బాగా నచ్చింది అని రాంచరణ్ పేర్కొన్నారు.

విజయ్ సేతుపతి సూపర్

విజయ్ సేతుపతి సూపర్

దర్శకుడు బుచ్చిబాబు అదృష్టమా? లేక వైష్ణవ్ తేజ్ అదృష్టమో తెలియడం లేదు. విజయ్ సేతుపతి లాంటి హీరో వారి సినిమాలో నటించడం గొప్ప అదృష్టం. తమిళంలో పెద్ద హీరోను తండ్రి పాత్రలో చేయించడం గొప్ప విషయం. యాక్టింగ్ నేర్చుకోవాలంటే విజయ్ సేతుపతి లాంటి వారితో నటిస్తే చాలూ రాంచరణ్ అన్నారు.

బేబమ్మ యాక్టింగ్‌తో

బేబమ్మ యాక్టింగ్‌తో

ఇక హీరోయిన్ బేబమ్మ యాక్టింగ్ చాలా బాగుంది. బేబమ్మ అదోలా యాక్టింగ్ చేసింది. ప్రతీ ఒక్కరి హృదయాలను నీ నటనతో గెలుచుకొన్నావు. కుర్రాళ్లందరూ ఇలా కేకలు వేస్తున్నారంటే నీ నటన ఎంత గొప్పగా ఉందో ఊహించుకోవచ్చు. ఇక ముందు ఎంతో హైట్స్‌కు ఎదుగుతారు. మైత్రీ మూవీస్ నిర్మాతలకు కూడా డేట్స్ దొరుకతాయా అనే అనుమానం వస్తున్నది అని రాంచరణ్ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X