తీయించుకోవటం ఇబ్బందే...రామ్ చరణ్
ఫొటోలు తీయించుకోవడం ఇబ్బంది అనిపించినా పత్రికల్లో ముద్రితమయ్యాక ఎంతో అందంగా కనిపిస్తాయి..అంటున్నారు రామ్ చరణ్. ఆయన మంగళవారం సాయంత్రం ఆయన మాస్టార్స్ పత్రిక మూడో సంచికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...ఫొటోలకు పోజులివ్వడమంటే ఎందుకో నాకు మొదట్నుంచీ కష్టమే. అందుకు మోడల్స్ అయితేనే సరిపోతారు. ఫొటోలకు వివిధ భంగిమల్లో నిలబడటం కంటే నటించడమే సులభం అనిపిస్తుంది. అలాగే ఫొటో షూట్ అంటే ఇంతకుముందు ముంబై నుంచి స్టిల్ ఫొటోగ్రాఫర్స్ వచ్చేవాళ్లు. ఇప్పుడు దక్షిణ భారతంలో కూడా మంచి ఛాయాచిత్ర నిపుణులు ఉన్నారు అంటూ చెప్పుకొచ్చారు చరణ్. ఈ కార్యక్రమంలో మా అధ్యక్షులు మురళీ మోహన్, ఏవీయస్, అలీ, బెంగళూరు పద్మ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్..బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్, ధరణి దర్శకత్వంలో మెరుపు చిత్రాలు చేస్తున్నారు. వీటి తర్వాత త్రివిక్రమ్ తో చేయబోయే చిత్రం ఉంటుంది.


Click it and Unblock the Notifications











