twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘గెలిచినా ఓడినా పోరాడడమే ప్రధానం’: రామ్ చరణ్ తేజ్

    By Srikanya
    |

    విశాఖపట్నం: 'పతకం కాదు.. పోటీలో పాల్గొనడమే ముఖ్యం.. గెలిచినా ఓడినా పోరాడడమే ప్రధానం' అని ప్రముఖ హీరో రామ్‌చరణ్ తేజ అన్నారు. విశాఖలోని ఏయూ వ్యాయామవిద్య క్రీడా ప్రాంగణంలో జాతీయ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నీని మంత్రి గంటా శ్రీనివాసరావుతో కలిసి రామ్‌చరణ్ ప్రారంభించారు. విశాఖలో ఈ టోర్నీ ప్రారంభోత్సవంలో పాల్గొంటాననుకోలేదని, ఇక్కడ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండడం వల్ల అది సాధ్యమైందని చెప్పారు. ఇటీవల ఒలింపిక్స్‌లో భారత్ ఆర్చర్లు పతకాలు సాధించడంలో వెనుక బడ్డా చక్కటి ప్రతిభను కనబరిచారని ప్రశంసించారు.

    భైరవా.. కాసుకో... అంటూ రామ్‌చరణ్‌ విల్లు ఎక్కుపెట్టారు. అది చూసి ఫ్యాన్స్ మగధీరా... అంటూ కేరింతలు కొట్టారు. విశాఖ నగరంలోని ఏయూ గోల్డెన్‌ జూబ్లీ స్టేడియంలో చెరుకూరి లెనిన్‌ స్మారక ర్యాంకింగ్‌ జాతీయస్థాయి విలువిద్య పోటీలు ప్రారంభమయ్యాయి. మంత్రి గంటా శ్రీనివాసరావుతో కలిసి చరణ్‌ ఈ పోటీల్ని ప్రారంభించారు. వేడుకలో రామ్‌చరణ్‌, ఆయన సతీమణి ఉపాసన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

    'ఈ పోటీల్లో పాల్గొంటున్న జాతీయ స్థాయి ర్యాంకర్లను, మన రాష్ట్రం తరపున పాల్గొంటున్న విలుకాళ్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పోటీలకు హాజరయ్యాను. మీరంతా సత్తా చూపాలి.' అని రామ్ చరణ్ తేజ చెప్పారు. మంత్రి గంటా మాట్లాడుతూ విశాఖలో అన్ని క్రీడలకు ఒకే వేదికగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించాలని నిర్ణయించినట్టు చెప్పారు. క్రీడల్లో రాణించే విద్యార్థులకు మార్కులు కేటాయించి ప్రోత్సహించాలని కోరారు. రాష్ట్ర ఆర్చరీ సంఘం అధ్యక్షుడైన అనిల్‌ కామినేని తన అల్లుడు రామ్‌చరణ్‌కి విల్లు ఎక్కుపెట్టడం గురించి కొన్ని కిటుకులు కూడా చెప్పారు.

    ఈ కార్యక్రమంలో టోర్నీ నిర్వాహక కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈనెల 25 వరకు జరగనున్న ఈ పోటీల్లో 27 రాష్ట్రాలకు చెందిన జట్లు తలపడుతున్నాయి. తొలుత జాతీయపతాకాన్ని మంత్రి గంటా, సమాఖ్య పతాకాన్ని ఏయూ ఇన్‌చార్జి ఉపకులపతి జార్జివిక్టర్ ఆవిష్కరించారు. పదిహేడు రాష్ట్రాలు, పారామిలిటరీ దళాలకు చెందిన విలుకాళ్ళు మార్చ్‌పాస్ట్‌లో పాల్గొని గౌరవ వందనం సమర్పించారు. రామ్‌చరణ్ కాంపౌండ్ విల్లును, గంటా రికర్వ్ విల్లును ఎక్కుపెట్టి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు.

    English summary
    Ram Charan launched Cherukuri Lenin Memorial Archery Championship at Vizag.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X