రామ్ చరణ్ బ్యాక్ టు వర్క్

By Bojja Kumar

పెళ్లి సంబరం, హనీమూన్ ముచ్చట తీరడంతో మెగా వపర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మళ్లీ తన వృత్తిలో నిమగ్నమయ్యేందుకు సిద్ధం అవుతున్నాడు. భార్య ఉపాసనతో కలిసి సోమవారం వాటికన్ సిటీకి వెళ్లి హనీమూన్ ఎంజ్ చేసిన చరణ్ మూడు రోజుల అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. రెండు రోజుల విశ్రాంతి అనంతరం అంటే...ఆదివారం నుంచి చరణ్ వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంలో పాల్గొన బోతున్నాడు. నేను పెళ్లి కోసం కేవలం 16 రోజుల బ్రేక్ మాత్రమే తీసుకున్నాను. తిరిగి వినాయక్ సినిమా షూటింగులో పాల్గొనబోతున్నాను అంటూ చరణ్ వెల్లడించారు.

ఈ చిత్రాన్ని నిర్మించ తలపెట్టిన యూనివర్సల్ మీడియా బ్యానర్ ఫై 'చెర్రీ' అనే టైటిల్ ఫిలిం చాంబర్లో నమోదైంది. దీనిని బట్టి ఈ సినిమాకు 'చెర్రీ' పేరును ఖరారు చేసినట్టు అర్ధం అవుతుంది. రామ్ చరణ్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ప్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ చిత్రంలో కాజల్,అమలా పౌల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు.

ఈ చిత్రంలో బ్రహ్మానందం జిలేబి అనే పాత్రలో కనిపించనున్నాడు. అదుర్స్ తరహాలో బ్రహ్మానందం,రామ్ చరణ్ మధ్య కామెడీ అదరేలా ప్లాన్ చేస్తున్నారు. చెర్రీ' చిత్రానికి ఆకుల శివ కథ అందించారు. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చుతున్నారు. బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, సత్యం రాజేష్, సుధా రాహుల్ దేవ్, రఘుబాబు, ఎంఎస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

చరణ్ ఈ చిత్రంతో పాటు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రంలో, అపూర్వ లఖియా దర్శకత్వంలో బాలీవుడ్ మూవీ 'జంజీర్' చేస్తున్నారు. ఇప్పటికే 'రచ్చ' భారీ విజయంతో మంచి జోస్ మీదన ఉన్న చరణ్ తన తదుపరి చిత్రాలపై కూడా భారీ ఆశలే పెట్టుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X