బిబిసి ఛానెల్ లో రామ్ చరణ్.. డిటేల్స్
ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన బిబిసి టీవిలో రామ్ చరణ్ కనపించనున్నారు. ఆయన ఆ ఛానెల్ కోసం ప్రత్యేకంగా ఇంటర్వూ ఇచ్చారచు. ఈ మేరకు హైదరాబాద్ లో షూట్ చేసారు.బిబిసి వరల్డ్ న్యూస్.. హైదరాబాద్ ఎపిసోడ్ లో చరణ్ గురించి ప్రస్దావన ఉంది. ఈ వారమే ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. హైదరాబాద్ కి చెందిన కవితారెడ్డి ఈ ఇంటర్వూని ప్లాన్ చేసింది.ఆవిడ బిబిసి లో గత పద్నాలుగు ఏళ్లగా పనిచేస్తున్నారు. ఆమె తాజాగా హైదరాబాద్ కి చెందిన ఆరుగురుని ఇంటర్వూ చేసారు. అందులో రామ్ చరణ్ ఒకరు. మిగతా వారు బిజినెస్ టైకూన్ సంజీవ్ రెడ్డి, హెచ్ ఆర్ డి మినిస్టర్ డా. దగ్గుపాటి పురందేశ్వరి, ఐటి ప్రపొషినల్ జనుక్ షా, బి టెక్ గ్రాడ్యూయేట్ రమేష్ రెడ్డి చల్లా, ఓల్డ్ సిటికి చెందిన సుల్తాన్ ఉన్నీసా ల ఇంటర్వూలతో పాటు ఈ ఇంటర్వూ వస్తుంది.
వేర్వేరు వృత్తుల్లో ఎదుగుతున్న వ్యక్తులను పరిచయం చేయటం ఈ ఎపిసోడ్ ప్రధాన ఉద్దేశ్యంగా చెప్తున్నారు. ఇక రామ్ చరణ్ ని టాలీవుడ్ కి రిప్రజెంటివ్ గా, రైజింగ్ స్టార్ గా ఆమె ఈ ఎపిసోడ్ లో చెప్పనున్నారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ రచ్చ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం మహాశివరాత్రి కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ చాలా భాగం పూర్తైంది.


Click it and Unblock the Notifications











