అదరకొట్టనున్న రామ్ చరణ్ కొత్త గెటప్

By Srikanya

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రానున్న రామ్ చరణ్ తేజ తన లేటెస్ట్ గెటప్ ని పూర్తి స్ధాయి మోడ్రన్ గా మార్చేసారు. ఈ చిత్రంలో చరణ్ డిఫరెంట్‌ లుక్‌తో కనిపించబోతున్నారట. ఇందుకోసం తన హెయిర్‌స్టయిల్‌ను మార్చుకున్నారు చరణ్‌. అలాగే కాస్ట్యూమ్స్‌ కూడా ఫుల్‌ మోడ్రన్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కొత్త గెటప్ నవతరాన్ని ఓ ఊపు ఊపుతుందని చెప్తున్నారు. అలాగే రామ్ చరణ్ క్యారెక్టర్ కూడా చాలా నావల్టీగా ఈ తరం యువత మనోభావాలకు దగ్గరగా ఉండి ఎట్రాక్ట్ చేస్తుందని చెప్తున్నారు. అంజనా ప్రొడక్షన్స్‌ పతాకంపై నాగబాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో జెనీలియా హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ముంబయ్‌ లో జరిగింది. డిసెంబర్‌ 11 నుంచి 20 వరకూ ఈ షెడ్యూలు జరిగింది. రామ్‌ చరణ్‌ తేజ్‌, తదితరులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. రెండో షెడ్యూలును ఆస్ట్రేలియాలో జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్ గా 'ఆరెంజ్" అని పెట్టారు. 'మగధీర"తో పోల్చితే, ఈ లేటెస్ట్ చిత్రం పూర్తిగా డిఫరెంట్ ఫ్లేవర్స్ తో వుంటుందని చరణ్ చెప్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: హారిస్‌ జైరాజ్‌, కెమెరా: కిరణ్‌రెడ్డి, మాటలు: తోట ప్రసాద్‌, ఆర్‌: ఆనంద్‌సాయి, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌. కె. వెంకటేష్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: మన్యం రమేష్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X