రికార్డులంటే మెగా ఫ్యామిలీవే.... అన్నట్లు తయారైంది!
హైదరాబాద్: రికార్డులంటే మెగా ఫ్యామిలీవే అన్నట్లు తయారైంది తెలుగు సినీ ఇండస్ట్రీలో. గత సంవత్సరం నుంచి టాలీవుడ్ రికార్డులు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. గతేడాది పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం తెలుగు సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టి సరికొత్త రికార్డులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ సంవత్సరం రామ్ చరణ్ ఇండస్ట్రీ రికార్డుల భరతం పట్టే పనిలో పడ్డాడు. రామ్ చరణ్-వినాయక్ కాంబినేషన్లో రూపొందిన 'నాయక్' చిత్రం సంక్రాంతికి విడుదలైన సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెలుతోంది. గతంలో ఫస్ట్ వీక్ కలెక్షన్ల రికార్డు విషయంలో 'గబ్బర్ సింగ్' చిత్రం రూ. 29 కోట్ల(ఆల్ ఓవర్ ఇండియా)తో రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ రికార్డు బద్దలు కొట్టి రూ. 31 కోట్లు(ఆల్ ఓవర్ ఇండియా) వసూళ్లు సాధించింది రామ్ చరణ్ 'నాయక్'. మరి ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు బద్దులు కొడుతుందో, ఈ సంవత్సరం రాబోయే రామ్ చరణ్ జంజీర్, ఎవడు చిత్రాలు ఎన్ని రికార్డులు సృష్టిస్తాయో?
నాయక్ కలెక్షన్ రికార్డ్ గురించి ఆ చిత్రం పబ్లిసిస్ట్ ఎస్‌కెఎన్ ట్విట్టర్లో స్పందిస్తూ...'1st వీక్ రూ. 31 కోట్లు. తెలుగు సినిమాకు సంబంధించి ఇండియాలో ఆల్ టైం రికార్డ్ షేర్. రూ. 50 కోట్లు ఈజీగా కలెక్ట్ చేసేలా ఉంది బొమ్మ. చరణ్ మరోసారి చరిత్ర సృష్టించబోతున్నాడు' అంటూ ట్వీట్ చేసాడు. ప్రస్తుతానికి చూసుకుంటే 'నాయక్' సినిమాకు పోటీగా ఉన్న సినిమా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ చిత్రం జోరు కూడా బాగానే ఉంది. మరి నాయక్ రికార్డులను క్రాస్ చేస్తుందో? లేదో? వేచి చూడాలి.
నిర్మాత. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ హీరోయిన్స్ గా చేసారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, రాహుల్ దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సుధ తదితరులు నటించారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్ సాయి, సంగీతం: తమన్, దర్శకత్వం: వివి వినాయక్.


Click it and Unblock the Notifications











