సైరా విషయంలో రాంచరణ్ దద్దరిల్లే మెగా ప్లాన్.. పవన్ కల్యాణ్ రంగంలోకి!

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు. చిరంజీవి పాత్రకు సంబంధించిన గెటప్ ఇప్పటికే అభిమానులను మెప్పించింది. ఇక నిర్మాత రాంచరణ్ ఈ సినిమాను అక్టోబర్ 2వ తేదీన సినిమాను ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా సుమారు రూ.300 కోట్ల వ్యయంతో తెరకెక్కింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

 పక్కాగా సైరా ప్రమోషన్ ఈవెంట్స్

పక్కాగా సైరా ప్రమోషన్ ఈవెంట్స్

సైరా ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ పక్కాగా ప్లాన్ చేస్తున్నది. సాధారణంగా ఇప్పటి వరకు టాలీవుడ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కేవలం హైదరాబాద్‌లో గానీ, లేదా ఆంధ్రాలోని ఏదో ఒక ప్రాంతంలో నిర్వహించే వారు. కానీ సైరా ప్రతిష్టాత్మకంగా రూపొందడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రెండు ప్రాంతాల్లో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే తేదీల వివరాలను ప్రకటించనున్నారు.

కర్నూల్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్

కర్నూల్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్

ఇక తొలిదశ స్వాతంత్ర్య ఉద్యమ వీరుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జన్మించిన కర్నూల్‌లో సైరా నర్సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ప్రాంతం కోసం నెత్తురు ధారపోసిన వీరుడికి ప్రీ రిలీజ్ ఈవెంట్ నివాళి అర్పించినట్టు అవుతుందనే భావనలో చిత్ర యూనిట్ ఉంది.

హైదరాబాద్‌లో అట్టహాసంగా

హైదరాబాద్‌లో అట్టహాసంగా

ఇక రెండో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ స్థాయిలో హైదరాబాద్‌లో నిర్వహించే విధంగా చర్యలు తీసుకొంటున్నది. ఈ సినిమా ఫంక్షన్‌కు చిత్రంలో నటించిన నటీనటులతోపాటు అత్యంత ప్రముఖులైన వ్యక్తులను ముఖ్య అతిథిలుగా ఆహ్వానిస్తున్నట్టు సమాచారం. అయితే చీఫ్ గెస్ట్ ఎవరనే విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. పవన్ కల్యాణ్ మాత్రం రాయలసీమ వేడుకకు హాజరవుతున్నట్టు సమాచారం.

బిజినెస్ మైండ్.. లోకల్ ఫీలింగ్

బిజినెస్ మైండ్.. లోకల్ ఫీలింగ్

ఇక సైరా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను రెండు ప్రాంతాల్లో నిర్వహించడం ద్వారా సినిమాపై భారీగా పెరగడానికి అవకాశం ఉంది. అలాగే ఓపెనింగ్స్ కూడా రావడానికి ఈ ఫంక్షన్‌ను ఉపయోగించుకొంటున్నారు. రాయలసీమ ప్రాంతంలో ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించడం చాలా తక్కువ. ఆ ప్రాంతంలో వేడుకను నిర్వహించడం ద్వారా లోకల్ అభిమానాన్ని పెంచి.. సినిమాను ఆదరించేలా చేయడంలో కూడా సైరా యూనిట్‌ తనదైన ముద్రను చూపేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

సైరాలో నటీనటులు

సైరాలో నటీనటులు

సైరా చిత్రంలో స్టార్ హీరోలు, హీరోయిన్లు నటించడం సెన్సేషన్‌గా మారింది. అమితాబ్, నయనతార, తమన్నా, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు లాంటి ఎందరో సినీ ప్రముఖులు సైరా చిత్రంలో భాగస్వామ్యం అయ్యారు. నయనతార చిరంజీవికి భార్యగా నటిస్తుండగా, నృత్యకారిణిగా తమన్నా నటించనున్నది. అవుకు రాజు అనే యుద్ధ వీరుడిగా కిచ్చ సుదీప్, రాజ పాండ్యన్‌గా విజయ్ సేతుపతి కనిపించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X