»   » చిరంజీవికే మా మద్దతు: చరణ్ బర్త్ డే వేడుకలో ఫ్యాన్స్!

చిరంజీవికే మా మద్దతు: చరణ్ బర్త్ డే వేడుకలో ఫ్యాన్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ram Charan birth day
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్ద గురువారం ఉదయం అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ తో పాటు మెగా బ్రదర్ నాగ బాబు, నిర్మాత బండ్ల గణేష్, ఎన్వీ ప్రసాద్, భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అభిమానులు రక్తదానం చేసారు. అనంతరం రామ్ చరణ్ మాట్లాడుతూ అభిమానుల సపోర్టు ఉంటే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసినందుకు నిర్మాత బండ్ల గణేష్‌కు చరణ్ థాంక్స్ చెప్పారు.

బర్త్ డే వేడుక సందర్బంగా రామ్ చరణ్ ఏదైనా రాజకీయాలకు సంబంధించిన విషయాలు మాట్లాడతారని, చిరంజీవి వైపే అభిమానులు అంతా ఉండాలనే విషయాలు మాట్లాడతారని.....అంతా భావించారు. అయితే రామ్ చరణ్ మాత్రం ఆ విషయాల జోలికి పోలేదు. అలాంటి విషయాలకు తావివ్వకుండా జాగ్రత్త పడ్డారు.

అభిమానులు మాట్లాడుతూ....తమ మద్దతు ఎప్పటికీ చిరంజీవికే ఉంటుందని, పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలని కోరుకుంటామని తెలిపారు. రామ్ చరణ్ పుట్టినరోజు ముగిసిన అనంతరం అభిమానులు భారీ సంఖ్యలో రక్తదానం చేయడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.

English summary
Ram Charan birth day celebrations held at Chiranjeevi blood bank today.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu