»   » బర్త్‌డే సెలబ్రేషన్స్, ఫ్యాన్స్‌తో చేయి కలిపిన చరణ్ (ఫోటోలు)

బర్త్‌డే సెలబ్రేషన్స్, ఫ్యాన్స్‌తో చేయి కలిపిన చరణ్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు వేడుకలు గురువారం ఉదయం హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంకు వద్ద ఘనంగా జరిగాయి. రామ్ చరణ్‌కు పుట్టినరోజు విషెస్ చెప్పేందుకు అభిమానులు భారీ సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర రామ్ చరణ్ యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసారు.

ఈ సందర్భంగా అభిమానులు రూపొందించిన 'ఫ్యాన్స్ తో ఫ్యాన్' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అభిమానుల అండ ఉంటే మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతానని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. నాగబాబు మాట్లాడుతూ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు మెగా అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాలను మెచ్చుకున్నారు.

కేక్ కటింగ్ కార్యక్రమం ముగిసిన అనంతరం రామ్ చరణ్ స్వయంగా వెళ్లి రక్తదానం చేస్తున్న అభిమానులను అభినందించారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో.....

రామ్ చరణ్ బర్తడే

రామ్ చరణ్ బర్తడే


రామ్ చరణ్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ హైదరాబాద్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంకు వద్ద గురువారం ఉదయం ఘనంగా జరిగాయి.

నాగబాబు

నాగబాబు

రామ్ చరణ్‌కు కేకు తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న మెగా బ్రదర్ నాగబాబు.

అభిమానులను ఉద్దేశించి నాగబాబు

అభిమానులను ఉద్దేశించి నాగబాబు


రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా హాజరైన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతున్న మెగా బ్రదర్ నాగబాబు

ఫ్యాన్స్ తో ఫ్యాన్ పుస్తకం

ఫ్యాన్స్ తో ఫ్యాన్ పుస్తకం


అభిమానులు రూపొందించిన ‘ఫ్యాన్స్ తో ఫ్యాన్' పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మెగా బ్రదర్ నాగబాబు.

రామ్ చరణ్

రామ్ చరణ్


తన పుట్టినరోజు సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి హాజరైన అభిమానులను ఉద్దేశించిన మాట్లాడుతున్న రామ్ చరణ్ తేజ్

బొకే అందిస్తున్న అభిమాని

బొకే అందిస్తున్న అభిమాని


రామ్ చరణ్ కు బొకే అందిస్తున్న మెగా అభిమాని.

భారీ కేక్

భారీ కేక్


రాష్ట్ర రామ్ చరణ్ యువత ఆధ్వర్యంలో భారీ కేకును తయారు చేయించారు.

ముస్తాబైన బ్లడ్ బ్యాంక్

ముస్తాబైన బ్లడ్ బ్యాంక్


రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకను పుస్కరించుకుని చిరంజీవి బ్లడ్ బ్యాంకు వద్ద ఇలా ఏర్పాట్లు చేసారు.

రామ్ చరణ్‌కు వెల్ కం

రామ్ చరణ్‌కు వెల్ కం


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు దండేసి బ్లడ్ బ్యాంకులోకి ఆహ్వానం పలుకుతున్న అభిమానులు.

అభిమానులకు అభినందన

అభిమానులకు అభినందన


రక్తదానం చేస్తున్న అభిమానులకు అభినందనలు తెలుపుతున్న రామ్ చరణ్ తేజ్.

ఫ్యాన్స్ సంబరం

ఫ్యాన్స్ సంబరం


స్వయంగా రామ్ చరణ్ వచ్చి తమతో చేయి కలిపి అభినందించడంతో ఫ్యాన్స్ చాలా హ్యాపీగా పీలయ్యారు.

బండ్ల గణేష్

బండ్ల గణేష్


రామ్ చరణ్‌కు పుట్టినరోజు విషెష్ తెలుపుతున్న నిర్మాత బండ్ల గణేష్

English summary
Ram Charan Birthday Celebrations 2014 Photos released. Ram Charan Teja celebrates his 29th birthday on March 27.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu