»   » చారిటీ: మారుతి సమక్షంలో చరణ్ బర్త్ డే (ఫోటోలు)

చారిటీ: మారుతి సమక్షంలో చరణ్ బర్త్ డే (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర రామ్ చరణ్ యువత ఆధ్వర్యంలో బేగంపేటలోని ఆశ్రయ్ ఆకృతి స్కూల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మారుతి అతిథిగా పాల్గొన్నారు. ఆశ్రమంలో పిల్లల మధ్య కేక్ కట్ చేయడంతో పాటు వారికి పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసారు. అనంతరం వారికి స్వీట్లు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మారుతితో పాటు పలువురు మెగా అభిమానులు పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

ప్రస్తుతం మారుతి మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు శీరిష్ హీరోగా 'కొత్త జంట' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగా అభిమానులు మారుతిని ఈ కార్యక్రమానికి అతిథిగా ఆహ్వానించారు.

మారుతి

మారుతి

శ్రయ్ ఆకృతి స్కూల్లో దర్శకుడు మారుతి.

కేక్ కట్ చేస్తున్న దృశ్యం

కేక్ కట్ చేస్తున్న దృశ్యం

రాష్ట్ర రామ్ చరణ్ యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మారుతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

పిల్లలకు కేక్ తినిపిస్తున్న దృశ్యం

పిల్లలకు కేక్ తినిపిస్తున్న దృశ్యం

ఆశ్రయ్ ఆకృతి స్కూల్లో పిల్లకు కేక్ తినిపిస్తున్న దర్శకుడు మారుతి.

పుస్తకాలు, పెన్నుల పంపిణీ

పుస్తకాలు, పెన్నుల పంపిణీ

కేక్ కటింగ్ కార్యక్రమం ముగిసిన అనంతరం ఆశ్రయ్ ఆకృతి స్కూలులోని పిల్లలకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసారు.

English summary
Maruthi guest for Ram Charan Birthday celebrations at Ashray-Akruti school.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu