Ram Charan Birthday: ఇండస్ట్రీలో అవమానించిన వాళ్లే సలామ్ కొట్టేలా.. ఆ రికార్డు కొట్టిన ఏకైక హీరో
టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా 'చిరుత' అనే చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అనుకున్న విధంగా గ్రాండ్ ఎంట్రీ దక్కకపోయినా.. ఆ వెంటనే వచ్చిన 'మగధీర'తో స్టార్‌డమ్‌ను అందుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. మధ్యలో కొన్ని పరాజయాలు పలకరించినా.. ఏమాత్రం కృంగిపోకుండా పంథాను మార్చుకుని మరీ సక్సెస్ బాట పట్టాడు.
ఇలా ప్రతి సినిమాకూ వేరియేషన్ చూపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక, ఇప్పుడు భారీ చిత్రాల్లో నటిస్తూ పాన్ ఇండియా స్టార్ అయ్యేందుకు శ్రమిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ పుట్టినరోజు (మార్చి 27) సందర్భంగా అతడి గురించి స్పెషల్ స్టోరీని చూద్దాం పదండి!

ఇండస్ట్రీ హిట్.. ఆ వెంటనే బిగ్ షాక్
రామ్ చరణ్ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘చిరుత' అంతగా ఆడలేదు. కానీ, రెండో చిత్రం ‘మగధీర'తో భారీ విజయాన్ని అందుకుంది. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అప్పట్లో కలెక్షన్లను కూడా రికార్డు స్థాయిలో రాబట్టింది. ఫలితంగా చరణ్ రేంజ్ అమాంతం పెరిగింది. అయితే, ఆ తర్వాత ‘ఆరెంజ్' భారీ డిజాస్టర్ వచ్చింది.

హిందీలోకి ఎంట్రీ.. విమర్శలపాలు
‘ఆరెంజ్' తర్వాత పలు చిత్రాల్లో నటించిన రామ్ చరణ్.. ఆ తర్వాత ‘జంజీర్' అనే మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీ కూడా డిజాస్టర్ ఫలితాన్నే అందుకుంది. అంతేకాదు, అప్పుడు ‘చెక్క ముఖం హీరో' అంటూ ఆ ఇండస్ట్రీలో చరణ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పరాజయంతో పాటు అవమానాలు ఎదురయ్యాయి.

హిట్లు ఫ్లాపులు.. పరిపూర్ణ నటుడిగా
‘ఎవడు' వంటి హిట్ తర్వాత ‘గోవిందుడు అందరి వాడేలే', ‘బ్రూస్‌లీ', వంటి వరుస ఫ్లాపులను ఎదుర్కొన్నాడు రామ్ చరణ్. వీటి తర్వాత ‘ధృవ'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇక, దాని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం'తో మరోసారి ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నాడు. అంతేకాదు, ఈ చిత్రంతో రామ్ చరణ్ పరిపూర్ణ నటుడిగా పేరు సంపాదించాడు.

తండ్రి కోసం మరో పాత్రలో చేస్తూ
హీరోగా నటిస్తూనే.. తండ్రి మెగాస్టార్ చిరంజీవి కోసం నిర్మాతగానూ మారాడు రామ్ చరణ్. ఆయనను సినిమాల్లోకి తిరిగి తీసుకొచ్చేందుకు కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ ఏర్పాటు చేసి ‘ఖైదీ నెంబర్ 150' అనే సినిమాను నిర్మించాడు. ఆ తర్వాత ‘సైరా: నరసింహారెడ్డి' కోసం భారీ ఖర్చుతో రిస్క్ చేశాడు. అప్పటి నుంచి చిరు సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు.

వరుస సినిమాలతో ఫుల్ బిజీగానే
‘వినయ విధేయ రామ' వంటి డిజాస్టర్ తర్వాత గ్యాప్ తీసుకున్న రామ్ చరణ్ RRR మూవీలో నటించాడు. అలాగే, కొరటాల - చిరు కలయికలో వస్తున్న ‘ఆచార్య'లోనూ రామ్ చరణ్ ‘సిద్ధ' అనే పాత్రను చేస్తున్నాడు. వీటితో పాటు దిగ్గజ దర్శకుడు శంకర్‌తో ఓ సినిమాను పట్టాలెక్కించాడు. అంతేకాదు, గౌతమ్ తిన్ననూరితోనూ రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు.

ప్రజాసేవలో తండ్రికి తగ్గ కొడుకు
చిన్న వయసులోనే ఎన్నో బాధ్యతలను మోస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. సినిమాల పరంగా హీరోగా, నిర్మాతగా వ్యవహరిస్తున్న అతడు.. ఎన్నో అవార్డులు అందుకున్నాడు. అదే సమయంలో భార్య ఉపాసన కోసం అపోలో ఆస్పత్రిలో భాగమై సేవ చేస్తున్నాడు. వీటితో పాటు బ్లడ్ బ్యాంక్, ఆక్సీజన్ బ్యాంక్‌లు ఇలా ఎన్నో నడుపుతూ ప్రాణదాత అనిపించుకుంటున్నాడు.

టాలీవుడ్‌లో ఏకైక హీరోగా రికార్డు
సుదీర్ఘ ప్రయాణంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎన్నో సినిమాలు చేశాడు. వాటి ఫలితాలు ఎలా ఉన్నా.. టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్‌లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇలా టాలీవుడ్ స్టార్ హీరోల్లో మరెవరూ చేయలేదు. ఫ్యూచర్‌లోనూ మరిన్ని మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి రెడీ అని ఇప్పటికే చెప్పేశాడు.

అవమానించిన వాళ్లే సలామ్ కొట్టి
RRR మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రామ్ చరణ్ తన నటనతో అబ్బురపరిచాడు. ఒక దశలో ఎన్టీఆర్‌ను మించేలా యాక్టింగ్ చేశాడు. ఫలితంగా ఈ హీరో పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగుతోంది. దీంతో అప్పట్లో బాలీవుడ్‌లో అతడిని అవమానించిన వాళ్లు ఇప్పుడు సలామ్ కొడుతున్నారు. దీనికి సంబంధించిన ఓ స్క్రీన్ షాట్ కూడా తెగ వైరల్ అవుతోంది.
నటుడిగా, నిర్మాతగా చాలా కాలంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ఫిల్మీబీట్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.


Click it and Unblock the Notifications











