»   » రామ్ చరణ్ పుట్టిన రోజు విషెష్, తమిళంలో డీవిడిలుగా

రామ్ చరణ్ పుట్టిన రోజు విషెష్, తమిళంలో డీవిడిలుగా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ చరణ్ తన చిననాటి స్నేహితుడు శర్వానంద్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఫేస్ బుక్ ద్వారా తెలియచేసారు. ఆయన తనకు సోదరుడు, స్నేహితుడు అని, తనకు అత్యంత ఆప్తుడని, ఆయన ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటూ పోస్ట్ చేసారు. మీరూ ఆ పోస్ట్ చూడండి.

He is my brother and a friend who is always there when needed the most. Happy birthday day Sarva. Wish you more happiness ,love&peace in ur life.

Posted by Ram Charan on 6 March 2016

రన్ రాజా రన్, మళ్లి మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్‌ప్రెస్ రాజా....ఇలా హ్యాట్రిక్ సక్సెస్‌లతో హీరోగా దూసుకుపోతున్నారు శర్వానంద్. ఈ సక్సెస్ ల వెనుక అతడి పదేళ్ల నిరీక్షణ దాగి ఉంది. ఈ క్రమంలో అపజయాలు ఎదురైన నటుడిగా మాత్రం అతడు ఓడిపోలేదు.

పక్కింటి కుర్రాడు, సాధారణ ప్రేమికుడిగా...సహజత్వంతో కూడిన పాత్రలతో తనకంటూ ప్రత్యేక ముద్రను చాటుకుంటూ స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు శర్వానంద్. నేడు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. శర్వానంద్ నటించి చిత్రం త్వరలో రాజాధిరాజా టైటిల్ తో చిత్రం రిలీజ్ అవటం క్లారిటీ ఇచ్చారు.

శర్వానంద్ మాట్లాడుతూ.. ...తొలుత ఈ చిత్రానికి ఏమిటో ఈ మాయ అనే పేరును ఖరారు చేశారు. సినిమా చిత్రీకరణ పూర్తయి చాలా కాలమైంది. కానీ అనివార్య కారణాల వల్ల విడుదల ఆలస్యమైంది. తమిళంలో డైరెక్ట్ డీవీడీ రూపంలో విడుదల చేశారు. తెలుగులో త్వరలో విడుదల కానుంది. రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల ఫలితాల్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాకు రాజాధిరాజా అనే పేరు పెట్టినట్లున్నారు అన్నారు.

Ram Charan birthday wishes to Sharwanand

శర్వానంద్ మాట్లాడుతూ...ఎక్స్‌ప్రెస్ రాజా సక్సెస్ కొత్త ఉత్సాహాన్నిచ్చింది. సంక్రాంతి రేసులో భారీ పోటీ మధ్య విడుదలై పెద్ద విజయాన్ని సాధించింది. నిర్మాతలు, పంపిణీదారులులతో పాటు సినిమాకు పనిచేసిన అందరికి సంతృప్తిని మిగిల్చింది అన్నారు.

పుట్టినరోజు డెషిషన్ గురించి చెప్తూ... సినిమాల వేగాన్ని పెంచాలనుకుంటున్నాను. ఈ ఏడాది మూడు సినిమాలు చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాను. స్క్రిప్ట్ వర్క్‌లో జాప్యం కారణంగా నా ప్రతి సినిమా మధ్య ఎక్కువగా గ్యాప్ వస్తుంది. ఆ అంతరాన్ని తగ్గించాలనే ఆలోచనలో ఉన్నాను అన్నారు.

English summary
Ram Charan shared in FB:"He is my brother and a friend who is always there when needed the most. Happy birthday day Sarva. Wish you more happiness ,love&peace in ur life."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu