ఛలో బ్యాంకాక్ అంటున్న రాంచరణ్.. 15 రోజులు అక్కడే!
రంగస్థలం చిత్రం రాంచరణ్ కెరీర్ లో మరపురాని చిత్రంగా మారిపోయింది. టాలీవుడ్ రికార్డులని కొల్లగొట్టిన ఈ చిత్రం వసూళ్ల పరంగా బాహుబలి తరువాతి స్థానంలో నిలిచింది. సుకుమార్ దర్శకత్వం,రాంచరణ్ అద్భుత నటనతో ఈ చిత్రం మరో స్థాయికి చేరింది. రంగస్థలం విజయంతో చరణ్ మంచి జోరు మీద ఉన్నాడు. అదే జోరుతో బోయపాటి చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
బోయపాటి చిత్రంలో రాంచరణ్ ఇప్పటికే ఓ షెడ్యూల్ ఫినిష్ చేసాడు. రెండు యాక్షన్ సన్నివేశాల్ని కూడా ఈ షెడ్యూల్ లో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా చిత్ర యూనిట్ ఫారెన్ షెడ్యూల్ కు రెడీ అవుతోంది. బోయపాటి శ్రీను తదుపరి షెడ్యూల్ ని బ్యాంకాక్ లో నిర్వహించనున్నారు.

15 రోజుల పాటు బ్యాంకాక్ లో తదుపరి షెడ్యూల్ జరగనుంది. ఈ సందర్భంగా నిర్మాత డివివి దానయ్య స్పందించారు. మాస్ ఇమేజ్ ఉన్న మెగాపవర్ స్టార్ రాంచరణ్, మాస్ దర్శకుడు బోయపాటి కాంబినేషన్లో సినిమా అంటే అంచనాలు ఏస్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని అన్నారు. అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని ఆయన అన్నారు. బ్యాంకాక్ షెడ్యూల్ ఈ నెల 12 నుంచి ప్రారంభం అవుతుంది.


Click it and Unblock the Notifications











