పాపం అతనికి...రామ్ చరణ్ హ్యాండిచినట్లేనా?
హైదరాబాద్: బాలయ్యతో 'లెజండ్' సినిమా తెరకెక్కించి మళ్లీ ఫాంలోకి వచ్చిన బోయపాటి శ్రీను ఆ తర్వాత మెగాహీరో రామ్ చరణ్ తో సినిమా ప్లాన్ చేసుకున్నాడు. రామ్ చరణ్ నుండి కూడా సుముఖరావడంతో బోయపాటి ఈ విషయాన్ని పలు సందర్భాల్లో వెల్లడించారు.
అయితే ఈచిత్రం పట్టాలెక్కే పరిస్థితి లేదని, బోయపాటికి రామ్ చరణ్ హ్యాండిచ్చినట్లే అని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రంలో నటిస్తున్న రామ్ చరణ్ ఈ చిత్రం వీలైనంత త్వరగా పూర్త చేసి సెప్టెంబర్ నుంచి శ్రీను వైట్ల సినిమా చేస్తున్నట్టు ప్రకటన వెలువడింది. ఈ ప్రకటనతో రామ్ చరణ్ -బోయపాటి సినిమా ఉంటుందా? ఉండదా? అనే విషయమై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

'గోవిందుడు అందరి వాడేలే' సినిమా వివరాల్లోకి వెళితే....గాపవర్ స్టార్ రామ్ చరణ్, కాజల్ జంటగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో, పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత బండ్ల గణేష్ అత్యంత భారీ తారాగణంతో అత్యున్నత సాంకేతిక నిపుణులతో నిర్మిస్తున్న చిత్రం 'గోవిందుడు అందరి వాడేలే'.
హైదరాబాద్ రామానాయుడు సినీవిలేజ్‌లో భారీ సెట్ నిర్మించి కొన్ని సన్నివేశాలు చిత్రీకరణ చేసారు. కొంత షెడ్యూల్ బ్రేక్ తర్వాత జూన్ 5 నుండి తాజా షెడ్యూల్ ప్రారంభించనున్నారు. కుటుంబ కథా చిత్రాల దర్శకుడు అనగానే క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ ఎలా గుర్తొస్తారో...నటుడు ప్రకాష్ రాజ్, జయసుధ కూడా అలాగే గుర్తొస్తారు. వీరి కాంబినేషన్లో వచ్చిన దాదాపు అన్ని సినిమాలు విజయం సాధించాయి. మరోసారి ఈ జంట గోవిందుడు అందరి వాడేలే చిత్రంలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











