రామ్ చరణ్-బోయపాటి మూవీ పూర్తి వివరాలు ఇవే..
హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ చరణ్ మరో క్రేజీ దర్శకుడితో జతకట్టబోతున్నాడు. భద్ర, తులసి, సింహా లాంటి మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటితో సినిమా చేయబోతున్నాడు. 2013 ఫిబ్రవరిలో ఈ చిత్రం సెట్స్ మీదనకు వెళ్లనుంది. ఈవిషయం అధికారికంగా కన్‌ఫర్మ్ అయింది. ఇండస్ట్రీలో నెం.1 స్థానానికి ఎదగాలంటే ముందు మాస్ ప్రేక్షకుల మెప్పించాలి. ఈ నేపథ్యంలో ఆ కోవకి చెందిన దర్శకులతో చేయడానికి చెర్రీ ఇంట్రస్టు చూపుతున్నాడు.
కొన్ని రోజుల క్రితమే బోయపాటి రామ్ చరణ్‌కు కథ వివరించగా..ఓకే చెప్పాడు. ప్రస్తుతం స్క్రిప్టుకు సంబంధించిన ఫైనల్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత కె.ఎస్ రామారావు క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై నిర్మించనున్నారు. త్వరలో ఈ సినిమా విషయమై ప్రెస్ స్టేట్ మెంట్ వెలువడనుంది.
ప్రస్తుతం రామ్ చరణ్ వివి వినాయక్ దర్శకత్వంలో 'నాయక్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపు వంశీ పడి పల్లి దర్శకత్వంలో 'ఎవడు', బాలీవుడ్లో జంజీర్ చిత్రంలో కూడా చెర్రీ నటిస్తున్నాడు. మొత్తానికి 2013 సంవత్సరంలో రామ్ చరణ్ అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. చరణ్ ప్రస్తుతం నటిస్తున్న మూడు సినిమాలో ఒకే సంవత్సరంలో విడుదల కానున్నాయి.
'నాయక్' చిత్రం సంక్రాంతికి విడుదలవుతుండగా.... కొన్ని రోజుల గ్యాప్‌తోనే 'ఎవడు', 'జంజీర్' చిత్రాలు రిలీజ్ అవుతాయి. అదే విధంగా మరికొన్ని కొత్త ప్రాజెక్టులు కూడా ప్రారంభం కానున్నాయి. చెర్రీ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'జంజీర్' చిత్రం వివరాల్లోకి వెళితే... రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈచిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. అమిత్ మిశ్రా ఈ చిత్రానికి నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో సంజయ్ దత్, సోనూసూద్, ప్రకాష్ రాజ్, మహిగిల్, అతుల్ కులకర్ణి కూడా ముఖ్య పాత్రలు పోస్తున్నారు.


Click it and Unblock the Notifications











